కోహ్లీ మ్యాచ్‌లు చూసేందుకు తల్లి నగలు అమ్మిన ఫ్యాన్
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని గురించి మనకు తెలిసిందే. ఒంటిపై పూర్తిగా త్రివర్ణ పతాకం రంగులు వేసుకొని, సచిన్ పేరు రాసుకుని పెద్ద జెండా పట్టుకుని టీమిండియా ఆడేటటువంటి ప్రతి మ్యాచ్‌లోనూ కనిపించే సుధీర్ గౌతమ్ గురించి తెలిసిందే.
ఈ మధ్య కాలంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రేజీ ఫ్యాన్ రాంబాబు కూడా ఈ మధ్య ప్రతి మ్యాచ్‌లోనూ సందడి చేస్తున్నాడు. వీరిద్దరి తర్వాత తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ కొత్త వీరాభిమాని వచ్చాడు. అతని పేరు నికాశ్ కన్హర్.

33 ఏళ్ల నికాశ్ ఓ బస్ కండక్టర్
ఒడిశాలోని కంధామల్ జిల్లాకు చెందిన 33 ఏళ్ల నికాశ్ ఓ బస్ కండక్టర్. ఇప్పటికే తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లిని నికాశ్ నాలుగుసార్లు కలిశాడు. కటక్‌లో జరిగిన రెండో వన్డే సందర్భంగా చివరిసారిగా కోహ్లీతో మాట్లాడే అవకాశం దక్కిందని తెలిపాడు.

చివరి వన్డేలో కోహ్లి జెర్సీ వేసుకొని జెండా ఊపాడు
మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా కోల్ కతాలో జరిగిన చివరి వన్డేలో కోహ్లి జెర్సీ వేసుకొని జెండా ఊపుతూ నికాశ్ సందడి చేశాడు. మ్యాచ్ అనంతరం జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో నికాశ్ మాట్లాడుతూ విశాఖపట్నం, కటక్, రాంచీ, కోల్‌కతాలో జరిగే మ్యాచ్‌లు చూస్తానని చెప్పాడు.

కోహ్లి అంటే ఎంతో అభిమానం
సుధీర్, రాంబాబులాగే ఇతనికి కూడా క్రికెట్ అన్నా, కోహ్లి అన్నా ఎంతో అభిమానం. టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్ చూడాలని ఉన్నా తనకు అంత ఆర్థిక స్థోమత నాకు లేదని తెలిపాడు. ఈ మ్యాచ్‌లు చూడటానికే నా ఇంటి ఖర్చులు, బాధ్యతలను కూడా తగ్గించుకున్నానని చెప్పాడు.

కోహ్లీ మ్యాచ్ కోసం తల్లి నగలమ్మిన నికాశ్
కోహ్లీ ఎప్పుడు తనని కలిసినా, తన బాగోగులు అడుగుతాడని చెప్పాడు. కోహ్లీ అడే మ్యాచ్‌లు చూసేందుకు గాను తన తల్లి నగలు అమ్మానని తెలిపాడు. టెస్టు క్రికెట్‌కు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనిల వీడ్కోలు తర్వాత కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications