కోహ్లీ 139 అవుట్, 600కి చేరువలో టీమిండియా ?

హైదరాబాద్: టెస్ట్ సిరీస్‌లో భాగంగా వెస్టీండీస్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆరో వికెట్‌ను కోల్పోయింది. 139 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ ఔటయ్యాడు. షెర్మన్ లూయిస్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి దేవేంద్ర బిషూ క్యాచ్ పట్టడంతో కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. కోహ్లీ ఔట్ కావడంతో అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం టీమిండియా 129ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 549 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(34), కుల్దీప్ యాదవ్(2) ఉన్నారు.

రెండో రోజు కెప్టెన్ కోహ్లి సెంచరీ
రెండో రోజు ఆటలో కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. దేవేంద్ర బిషూ వేసిన బంతికి ఫోర్ కొట్టిన కోహ్లీ 184 బంతుల్లో కోహ్లీ టెస్టు కెరీర్‌లో 24వ శతకం పూర్తి చేశాడు. బంతులను బలంగా కొట్టకుండా నిదానంగా ఆడిన విరాట్.. సింగిల్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. కోహ్లి ఇన్నింగ్సులో కేవలం 7 ఫోర్లు మాత్రమే బాదాడు.

శతకం చేజార్చుకున్న పంత్
మిడిలార్డర్ ఆటగాడు రిషబ్ పంత్ తృటిలో శతకం చేజార్చుకున్నాడు. 92 పరుగుల వద్ద దేవేంద్ర బిషూ బౌలింగ్‌లో కీమో పాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రెండో రోజు ఉదయం కాస్త జాగ్రత్తగా ఆడిన పంత్.. 57 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అక్కడి నుంచి జోరు పెంచి వన్డే తరహాలో విరుచుకుపడ్డాడు. శతకానికి చేరువైన దశలో దురదృష్టవశాత్తూ ఔటయ్యాడు.

364/4 స్కోరుతో ఉన్న భారత్
తొలిరోజు ఆట ముగిసే సమయానికి 364/4 స్కోరుతో ఉన్న భారత్ 500 దాటి పరుగులు పెడుతోంది. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. రిషత్ పంత్(92) సాయంతో స్కోరు బోర్డును కోహ్లీ పరుగులు పెట్టించాడు. పంత్ ఔట్ అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా కూడా నిలకడగానే ఆడాడు. భోజన విరామ సమయానికి 117ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 506/5 స్కోరుతో నిలిచింది.

99 బంతుల్లో శతకం చేసిన పృథ్వీ షా
టీమిండియా జోరు ఇలాగే కొనసాగితే వెస్టిండీస్ ముందు భారీ స్కోరును ఉంచవచ్చు. తొలిరోజు అరంగేట్ర బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా ఆట హైలెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఓపెనర్‌గా బరిలోకి దిగిన షా... విండీస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 99 బంతుల్లో శతకం చేసి ఎన్నో రికార్డులను నమోదు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications