Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ నువ్వు మారవా..! కొత్త కుర్రాడి చేతిలో చెత్తగా ఔట్.. జట్టులోంచి తీసేయాలంటూ ట్రోల్స్

Virat Kohli Failure continues as He Cheeply Catch Out at single run, netizens trolled virat

బర్మింగ్‌హమ్ : ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టీ20లో ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మళ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జోస్ బట్లర్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఇండియా బ్యాటింగ్‌కు దిగింది. రిషబ్ పంత్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. వీరిద్దరూ భారత్‌కు శుభారంభం ఇచ్చారు. పవర్ ప్లేలో మంచి స్కోరు అందించగలిగారు. ఇక తొలి ఓవర్లోనే 1పరుగు వద్ద రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను జాసన్ రాయ్ మిస్ చేయడంతో.. హిట్ మ్యాన్ చెలరేగిపోయాడు. సామ్ కరన్ వేసిన రెండో ఓవర్లో రిషబ్ పంత్ ఫోర్‌తో టచ్‌లోకి రాగా.. విల్లీ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి రోహిత్ సిక్సుతో హిట్టింగ్ మొదలెట్టాడు. పంత్ సైతం రెండు ఫోర్లు బాదడంతో ఆ ఓవర్లో 17పరుగులొచ్చాయి. వీరిద్దరూ అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించారు.

కొత్తోడే గానీ కిరాక్ బౌలింగ్ వేసి

ఇక కొత్త కుర్రాడు రిచార్డ్ గ్లీసన్ బౌలింగ్లో హిట్టింగ్ చేయాలని చూసిన రోహిత్ (20బంతుల్లో 31పరుగులు 3ఫోర్లు, 2సిక్సర్లు) కీపర్ బట్లర్ పట్టిన అద్భుత క్యాచ్‌కు ఔటయిపోయాడు. దీంతో 49పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక మంచి ఫాంలో ఉన్న దీపక్ హుడాను కాదని విరాట్ కోహ్లీని టీం మేనేజ్ మెంట్ నమ్ముకుంటే.. కోహ్లీ మళ్లీ నట్టేటా ముంచాడు. రిచార్డ్ గ్లీసన్ వేసిన 7వ ఓవర్ తొలి బంతికి నిర్లక్ష్య కర రీతిలో హిట్ చేయగా.. బంతి గాల్లోకి లేచింది. దాన్ని డేవిడ్ మలన్ అద్భుతంగా క్యాచ్ అందుకోవడంతో కోహ్లీ 1పరుగుకే పెవిలియన్ బాటపట్టాడు.

కోహ్లీ తనంతట తానే తప్పుకోవాలి

కోహ్లీ ఔటయిన దాని కంటే.. ఔటైన తీరే అతను ఎంతటి వరస్ట్ స్టేజీలో ఉన్నాడో చెబుతుంది. కవర్ డ్రైవ్ ఆడాల్సిన బంతిని.. నిర్లక్షకరంగా హిట్ చేసి మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో కోహ్లీని తప్పించాలని లేకుంటే కోహ్లీయే స్వతాహగా తప్పుకుని ఫామ్‌లో ఉన్నవాళ్లకు ఛాయిస్ ఇవ్వాలంటూ నెట్టింట కామెంట్లు హోరెత్తుతున్నాయి. కొన్నాళ్లు దేశవాళీ టోర్నీల్లో ఆడి ఫామ్ పుంజుకున్నాక అంతర్జాతీయ క్రికెట్లోకి కోహ్లీ వస్తే బాగుంటుందని, అంతవరకు టీంను డిస్టబ్ చేయొద్దంటూ మరికొందరు కోహ్లీకి సూచనలే సూచనలు ఇస్తున్నారు.

కొత్త కుర్రాడి ఖాతాలో రోహిత్, కోహ్లీ పంత్

ఇంగ్లాండ్ తరఫున అరంగేట్రం చేసిన కొత్త కుర్రాడు గ్లీసన్ తొలుత రోహిత్, విరాట్ కోహ్లీని ఔట్ చేయడమే కాకుండా.. 7వ ఓవర్ రెండో బంతికి పంత్ (26పరుగులు 15బంతుల్లో 4ఫోర్లు 1సిక్సర్ ) కీపర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక హ్యట్రిక్ బంతిని హార్దిక్ సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఏదేమైనా అరంగేట్రం చేసిన తొలి టీ20లోనే గ్లీసన్ కోహ్లీ, రోహిత్, పంత్ లాంటి మేటి ప్లేయర్లను ఔట్ చేయడం ఓ అరుదైన ఘనతగానే భావించాలి. దీంతో ఇంగ్లాండ్‌కు మంచి బ్రేకిచ్చాడు. ఇక క్రీజులో దిగిన హార్దిక్ పాండ్యా (12పరుగులు) , సూర్యకుమార్ (15పరుగులు) సైతం ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. వీరిద్దరు జోర్డాన్ వేసిన 11వ ఓవర్లో వరుస బంతుల్లో ఔటయిపోయారు. ఇక వీరిద్దరూ ఔటయ్యేసరికి ఇండియా స్కోరు 11ఓవర్లు పూర్తయ్యేసరికి 5వికెట్లు కోల్పోయి 89పరుగులుగా ఉంది.

తుది జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/ కెప్టెన్), డేవిడ్ మలన్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, రిచర్డ్ గ్లీసన్, మాథ్యూ పార్కిన్సన్

Story first published: Saturday, July 9, 2022, 20:29 [IST]
Other articles published on Jul 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+