Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kohli Ranji: ప్చ్.. కోహ్లీ క్లీన్ బౌల్డ్.. ఆఫ్‌స్టంప్‌ గాల్లోకి..

టీమిండియా స్టార్‌ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడా? బ్యాటింగ్‌ ఎలా చేస్తాడా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. పుష్కరకాలం తర్వాత దేశవాళీ క్రికెట్ లో పునరాగమనం చేసిన అతడు తీవ్రంగా నిరాశపరిచాడు.రైల్వేస్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో దిల్లీ టీమ్ తరఫున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (6) సింగిల్‌ డిజిట్‌కే ఔట్ అయ్యాడు.యశ్‌ ధూల్‌ ఔట్‌ అయిన తర్వాత సెకండ్‌ డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కేవలం 6 పరుగులు చేశాడు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బాల్ ను ఆడటంలో విఫలమై వికెట్‌ను సమర్పించుకున్నాడు.

Ranji trophy 2025 Virat Kohli fails on Ranji Trophy return scored only 6 runs ongoing Delhi vs Railways match at Arun Jaitley Stadium

రైల్వేస్‌ జట్టు బౌలర్ సంగ్వాన్‌ బౌలింగ్‌లో ఆఫ్‌ స్టంప్‌ ఎగిరి పడింది. ఫలితంగా కోహ్లీ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో విరాట్ అభిమానులకు కోహ్లీ బ్యాటింగ్ చూసే సంబరం కాసేపే దక్కినట్టైంది. ఈ ఔట్ తో.. దేశవాళీ క్రికెట్‌ బరిలోకి దిగి నిరాశపరిచిన స్టార్‌ బ్యాటర్ల జాబితాలో కోహ్లీ కూడా చేరిపోయాడు.


వీళ్లంతా కూడా తక్కువ స్కోరుకే
అంతకుముందు మ్యాచుల్లో రోహిత్ శర్మ, రిషభ్‌ పంత్, యశస్వి జైస్వాల్ కూడా పరుగులు చేయలేక ఇబ్బంది పడద్డారు. తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఇక ఇప్పుడు కనీసం కోహ్లీ బ్యాటింగ్‌ను అయినా ఆస్వాదిద్దామనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఇది కూడా జరగలేదు.

దీంతో ఇక విరాట్‌ను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులతో హోరెత్తిన స్టేడియం.. ఒక్కసారిగా మూగబోయింది. అప్పటివరకు కోహ్లీ బ్యాంటింగ్‌కు దిగుతుంటే అభిమానులు నినాదాలతో ఊగిపోయిన మైదానం.. అతడి ఔట్ తో నిరుత్సాహపడిపోయింది. ఇక చేసేదేమిలేక అరుణ్ జెట్లీ స్టేడియానికి వచ్చిన అభిమానులు కూడా తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు.

Story first published: Friday, January 31, 2025, 11:48 [IST]
Other articles published on Jan 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+