For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli: వైఫల్యాల నుంచి విజయపథంలోకి.. ఇది విరాట్ కోహ్లీ కథ..

Virat Kohli faced criticism last year, but now he is back with Bat

భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న మరో క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈ రోజు అతడి బర్త్ డే.. అయితే విరాట్ కోహ్లీ గత కొద్ది సంవత్సరాలు ఓడుదుడుకులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా గతేడాది అతనికి చాలా అవమానాలు, విమర్శాలు ఎదురయ్యాయి. కెప్టెన్సీ పోవడం, ఫామ్ కోల్పోవడం, మూడేళ్లుగా సెంచరీ లేకపోవడంతో కోహ్లీ పై తీవ్ర విమర్శాలు వచ్చాయి. ఓ సమయంలో కొందరు.. కోహ్లీ పని అయిపోయిందన్నారు. అతడు రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదన్నారు.

కోహ్లీ ఈ విమర్శాలను ఆసియా కప్ ముందు వరకు ఎదుర్కొన్నాడు. ఆసియా కప్ లో ఫామ్ అందుకోవడంతో అతనిపై కాస్త విమర్శాలు తగ్గాయి. ఆసియా కప్‌లో అతను మెరుపు సెంచరీ చేశాడు. ఈ టీ20 వరల్డ్ కప్ తో కోహ్లీ మరింత ఫామ్ లోకి వచ్చాడు. ముఖ్యంగా పాకిస్థాన్ పై అతడు అడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ మరిచిపోలేనిది. పాక్ పై అతను 53 బంతుల్లో 4 సిక్స్ లు, 6 ఫోర్లతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ పై కూడా హాఫ్ సెంచరీ చేశాడు. బంగ్లాదేశ్ పై కూడా హాఫ్ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 102 టెస్టులు ఆడి 8,704 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 26 వన్డేలు ఆడిన కోహ్లీ 12, 334 పరుగులు చేశాడు. ఇందులో 43 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20 మ్యాచ్ ల విషయానికొస్తే 113 మ్యాచ్ లు ఆడిన విరాట్ 3,932 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

విరాట్ కోహ్లీ వన్డేల్లో 4 వికెట్లు పడగొట్టగా.. టీ20ల్లో 4 వికెట్లు తీశాడు. విరాట్ కోహ్లీ తన మొదటి వన్డేను శ్రీలంకపై ఆడగా.. మొదటి టెస్ట్ ను వెస్టిండీస్ పై ఆడాడు. టీ20 వరల్డ్ కప్ 2022లో కోహ్లీ ఇప్పటి వరకు 4 మ్యాచ్‌ల్లో 220 పరుగులు చేశాడు. అతను ఈ 4 మ్యాచ్‌లలో ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. రెండు వేర్వేరు సందర్భాలలో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. కోహ్లీ 15 ఏళ్ల వయసులో క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. 2008లో అండర్ 19 ప్రపంచ కప్‌‌కి కెప్టెన్‌‌గా వ్యవహరించాడు.

Story first published: Saturday, November 5, 2022, 9:57 [IST]
Other articles published on Nov 5, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+