IND VS NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్ - ఏకంగా 6 భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లీ
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం (మార్చి 2) టీమిండియా - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే విరాట్ కోహ్లీ.. పాకిస్థాన్ పై శతకం బాది ఫామ్ లో వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడికి కివీస్ తో జరిగే మ్యాచ్ లో.. ఏకంగా 6 రికార్డులను బ్రేక్ చేసే అవకాశం వచ్చింది. అందులో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్, శిఖర్ ధావన్ రికార్డులు కూడా ఉన్నాయి. అవేంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసింది వీరే :
కోహ్లీ మరో 52 పరుగులు చేస్తే శిఖర్ ధావన్ ఛాంపియన్స్ ట్రోఫీ అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడు.
- శిఖర్ ధావన్ - 10 మ్యాచ్‌లు, 701 పరుగులు, అత్యధిక స్కోరు 125
- సౌరవ్ గంగూలీ - 13 మ్యాచ్‌లు, 665 పరుగులు, అత్యధిక స్కోరు 141*
- విరాట్ కోహ్లీ - 15 మ్యాచ్‌లు, 651 పరుగులు, అత్యధిక స్కోరు 100*
- రాహుల్ ద్రవిడ్ - 19 మ్యాచ్‌లు, 627 పరుగులు, అత్యధిక స్కోర్ 76
- రోహిత్ శర్మ - 12 మ్యాచులు, 542 పరుగులు, అత్యధిక స్కోరు 123*

ఛాంపియన్స్ ట్రోఫీలో తరఫున అత్యధిక పరుగుల వీరులు వీరే :
ఓవరాల్ గా ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 7వ స్థానంలో నిలిచాడు. విరాట్ మరో 142 పరుగులు చేస్తే గేల్ ను అధిగమిస్తాడు.
- క్రిస్ గేల్ (వెస్టిండీస్) - 17 మ్యాచ్‌లు, 791 పరుగులు, అత్యధిక స్కోరు 133*
- మహేల జయవర్ధనే (శ్రీలంక) - 22 మ్యాచ్‌లు, 742 పరుగులు, అత్యధిక స్కోరు 84*
- శిఖర్ ధావన్ (భారత్) - 10 మ్యాచ్‌లు, 701 పరుగులు, అత్యధిక స్కోరు 125
- కుమార సంగక్కర (శ్రీలంక)- 22 మ్యాచ్‌లు, 683 పరుగులు, అత్యధిక స్కోర్ 134*
- సౌరవ్ గంగూలీ (భారత్) - 13 మ్యాచ్‌లు, 665 పరుగులు, అత్యధిక స్కోరు 141*
- జాక్వెస్ కల్లీస్ (దక్షిణాఫ్రికా) - 17 మ్యాచ్‌లు, 653 పరుగులు, అత్యధిక స్కోరు 113*
- విరాట్ కోహ్లీ (భారత్) - 15 మ్యాచ్‌లు, 651 పరుగులు, అత్యధిక స్కోరు 100*
వన్డేల్లో న్యూజిలాండ్ పై అత్యధిక పరుగులు చేసింది వీరే :
న్యూజిలాండ్ పై భారత్ తరఫున సచిన్ తెందుల్కర్(42 వన్డేలు, 1750 పరుగులు) అత్యధిక పరుగులు చేశాడు. కోహ్లీ మరో 106 పరుగులు చేస్తే ఈ రికార్డును అధిగమిస్తాడు.
- సచిన్ తెందుల్కర్ - 42 మ్యాచ్‌లు, 1750 పరుగులు, అత్యధిక స్కోరు 186*
- విరాట్ కోహ్లి - 31 మ్యాచ్‌లు, 1645 పరుగులు, అత్యధిక స్కోరు 154*
- వీరేంద్ర సెహ్వాగ్ - 23 మ్యాచ్‌లు, 1157 పరుగులు, అత్యధిక స్కోరు 123
- మహ్మద్ అజారుద్దీన్ - 40 మ్యాచులు, 1118 పరుగులు అత్యధిక స్కోరు - 108*
- గంగూలీ - 32 మ్యాచ్‌లు, 1079 పరుగులు, అత్యధిక స్కోరు 153*
వన్డేల్లో న్యూజిలండ్ పై ఎక్కువ సెంచరీలు బాదిన ప్లేయర్స్ :
విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, రికీ పాంటింగ్.. న్యూజిలాండ్ పై సమానంగా 6 సెంచరీలతో ఉన్నారు. ఇప్పుడు విరాట్ మరో శతకం బాదిన వాళ్లని అధిగమిస్తాడు.
- వీరేంద్ర సెహ్వాగ్ (భారత్) - 23 మ్యాచ్‌లు, 1157 పరుగులు, 6 సెంచరీలు
- విరాట్ కోహ్లి (భారత్) - 32 మ్యాచ్‌లు, 1645 పరుగులు, 6 సెంచరీలు
- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 51 మ్యాచ్‌లు, 1971 పరుగులు, 6 సెంచరీలు
- సచిన్ తెందుల్కర్ (భారత్) - 42 మ్యాచ్‌లు, 1750 పరుగులు, 5 సెంచరీలు
- సనత్ జయసూర్య (శ్రీలంక) - 47 మ్యాచ్‌లు, 1519 పరుగులు, 5 సెంచరీలు
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్స్ :
విరాట్ కోహ్లీ ఆరు సార్లు ఫిఫ్టీ స్కోర్స్ చేశాడు. ఈ సారి కూడా అతడు చేస్తే.. శిఖర్ ధావన్,గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ను దాటి అగ్రస్థానానికి చేరుకుంటాడు.
- శిఖర్ ధావన్ (భారత్) - 10 మ్యాచ్‌లు, 701 పరుగులు, 6 అర్ధ సెంచరీలు
- సౌరవ్ గంగూలీ (భారత్) - 13 మ్యాచ్‌లు, 665 పరుగులు, 6 అర్ధ సెంచరీలు
- విరాట్ కోహ్లి (భారత్) - 15 మ్యాచ్‌లు, 651 పరుగులు, 6 హాఫ్ సెంచరీలు,
- రాహుల్ ద్రవిడ్ (భారత్) - 19 మ్యాచ్‌లు - 627 పరుగులు, 6 అర్ధ శతకాలు
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసింది వీరే :
వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో అతడు మరో 150 పరుగులు చేస్తే కుమార సంగక్కర ను దాటి రెండో స్థానంలో నిలుస్తాడు. సచిన్ 18,426తో టాప్ లో ఉండగా.. కుమార సంగక్కర 14,234 పరుగులతో ఉన్నాడు. కోహ్లీ 14,085 రన్స్ తో కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications