న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెపాక్‌లో చెన్నైతో మ్యాచ్: మూడు రికార్డులపై కన్నేసిన కోహ్లీ

IPL 2019 : Virat Kohli Eyeing On Three Records In IPL 2019 Against Chennai Super Kings | Oneindia
Virat Kohli Eyeing Hat-Trick Of Records In IPL 2019 Opener Against CSK

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌‌కి మరికొద్ది గంటల్లోనే తెరలేవనుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. శనివారం రాత్రి 8 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌కి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇదిలా ఉంటే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ శనివారం చెన్నైతో జరగనున్న మ్యాచ్‌లో ఒకేసారి మూడు రికార్డులపై కన్నేశాడు. అవేంటో ఒక్కసారి చూద్దాం...

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఐపీఎల్లో అత్యధిక పరుగులు

ఐపీఎల్లో అత్యధిక పరుగులు

ఇప్పటివరకూ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌రైనా మొదటిస్థానంలో ఉన్నాడు. 176 మ్యాచుల్లో 4985 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతుండగా రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ 163 మ్యాచుల్లో 4948 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో 38 పరుగులు చేస్తే సురేశ్ రైనాను అధిగమిస్తాడు.

ఐపీఎల్‌లో 5000 పరుగులు

ఐపీఎల్‌లో 5000 పరుగులు

ఈ సీజన్‌తో సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 5వేల పరుగుల క్లబ్‌లో చేరనున్నారు. మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై vs ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో 5వేల పరుగుల క్లబ్‌లో చేరేందుకు సురేశ్ రైనా 15 పరుగులు, విరాట్ కోహ్లీ 52 పరుగులు దూరంలో ఉన్నారు. చెన్నై టాస్ గెలిచి రైనా 15 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 5000 పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా సురేశ్ రైనా నిలుస్తాడు. అలా కాకుండా ఆర్సీబీ టాస్ గెలిచి కోహ్లీ 52 పరుగులు చేస్తే కోహ్లీ ఈ ఘనత సాధిస్తాడు.

అత్యధిక హాఫ్ సెంచరీలు

అత్యధిక హాఫ్ సెంచరీలు

ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. చెన్నైతో జరిగే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదితే.. ఇప్పటికే ఐపీఎల్‌లో 39 హాఫ్ సెంచరీలు బాదిన డేవిడ్‌ వార్నర్‌ సరసన చేరతాడు. దీంతో చెన్నైతో జరిగే తొలి మ్యాచ్‌లో కోహ్లీ మొత్తంగా 52 పరుగులు చేస్తే, ఒకేసారి మూడు రికార్డులు తన ఖాతాలో వేసుకుంటాడు.

తొలి మ్యాచ్‌లో జట్ల అంచనా:

తొలి మ్యాచ్‌లో జట్ల అంచనా:

చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్, కెప్టెన్), కేదార్ జాదవ్, బిల్లింగ్స్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శాంట్నర్, శార్ధూల్ ఠాకూర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: పార్థీవ్ పటేల్ (వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్, మొయిన్ అలీ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సిమ్రాన్ హిట్‌మెయిర్, శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, చాహల్.

Story first published: Saturday, March 23, 2019, 14:58 [IST]
Other articles published on Mar 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X