కలచి వేసింది: లాహోర్ పేలుడు ఘటనపై కోహ్లీ
ముంబై: ఈస్టర్ సందర్భంగా పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడి ఘటన తనను కలచివేసిందని భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నాడు.
లాహోర్ ఇక్బాల్ పార్క్‌లో ఆదివారం రాత్రి జరిగిన మానవబాంబు దాడిలో 70 మందికి పైగా చనిపోయారు, 300 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో అనేకమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉగ్రవాదానికి, హింసకు తాను వ్యతిరేకమని చెప్పారు.

ఉగ్రవాదం మతిలేని చర్య అన్నారు. మృతుల కుటుంబాలకు కోహ్లీ తన ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. ట్వంటీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ ప్రముఖులు పలువురు లాహోర్ పేలుళ్లను ఖండించారు. సిద్ధార్థ మల్హాత్రా లాహోర్ పేలుళ్లను ఖండించారు. బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా కూడా తీవ్రంగా స్పందించారు. హృదలయం లేని వ్యాధిగ్రస్తుల చర్యగా ఆమె అభివర్ణించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications