Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాహుల్‌ని వద్దనుకునే ధావన్‌ను తీసుకున్నాం: కోహ్లీ

Virat Kohli explains why India picked Shikhar Dhawan over KL Rahul for 1st Test

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో ఆడటమే పెను సవాలే. కానీ, ప్రస్తుత జట్టు చాలా బాగానే నెట్టుకొచ్చింది. మొదట్లో కాస్త తడబడినా మంచి బౌలింగ్ తీరును ప్రదర్శించి ప్రత్యర్థి జట్టుకు పెద్దగా స్కోరు చేయనివ్వలేదు. అలా అని అందివచ్చిన బంగారు అవకాశాన్ని వాడుకోలేకపోయింది. కోహ్లీసేన! కాస్తంత ఓపికగా ఆడివుంటే.. ఫలితం మరోలా ఉండేది! మూడు టెస్టుల సిరీస్‌లో తొలి విజయం భారత్‌ ఖాతాలో పడేది.

ఓడితే విశ్లేషించుకోవడం షరా మామూలే. ఈ నేపథ్యంలోనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని జట్టులో ఎంపికల గురించి పలువురు ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లి.. ఎంపికలు చేయటానికి కారణాలు వివరించాడు.

మరి కేఎల్ రాహుల్‌కు బదులుగా శిఖర్ ధావన్‌ను ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్నకు స్పందించిన కోహ్లీ ఇలా స్పందించాడు. తను ఎడమ చేతి వాటం కలిగి ఉన్న బ్యాట్స్‌మన్ కావడంతో మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ ఇటు అటు మారుతున్న నేపథ్యంలో బౌలర్ల ఖచ్చితంగా అయోమయంలో పడతారని ఇలా శిఖర్ ధావన్‌ను సెలక్ట్ చేశామని కెప్టెన్ కోహ్లీ పేర్కొన్నాడు.

మరి అజింకా రహానే బదులుగా రోహిత్ శర్మను ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్నకు స్పందించిన కోహ్లీ ఇలా స్పందించాడు. 'తాను ఆడిన చివరి మూడు టెస్టు మ్యాచ్‌లలో రోహిత్‌ బాగానే స్కోర్‌ చేశాడు. శ్రీలంక సిరీస్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ప్రస్తుత ఫామ్‌ ఆధారంగానే మేం అతన్ని తుది జట్టులోకి తీసుకున్నాం. ఓ జట్టుకు అదే కీలకమైన విషయం. విమర్శలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జట్టు బాగా ప్రాక్టీస్‌ చేసింది. కానీ, విఫలం అయ్యాం' అని కోహ్లి వివరించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 9, 2018, 17:27 [IST]
Other articles published on Jan 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+