Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేరీర్ మొత్తం మీద అలాంటి షాట్స్ ఆడలేదు- ఆ రెండు సిక్సర్లపై కోహ్లీ బయటపెట్టిన రహస్యం ఇదే!!

Virat Kohli explained in an interview what is his plan regarding two Sixes against Haris Rauf.

మెల్‌‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భారత్.. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. టీమిండియా మాజీ కేప్టెన్, బ్యాటింగ్ బ్యాక్‌బోన్ విరాట్ కోహ్లీ- ఈ మ్యాచ్‌లో విశ్వరూపాన్ని చూపాడు. ఓటమి కోరల్లో ఉన్న జట్టును గెలుపుబాట పట్టించాడు. 31 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుకు ఒంటిచేత్తో గెలుపుబాట పట్టించాడు. 53 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఆ రెండు సిక్సర్లు..

ఆ రెండు సిక్సర్లు..

పాకిస్తాన్‌పై భారత్ గెలవాలంటే చివరి 12 బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన దశ అది. విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా క్రీజ్‌లో ఉండటం వల్ల విజయం భారత్‌నే వరిస్తుందనే ఆశ అభిమానుల్లో నెలకొంది. 19వ ఓవర్‌లో గేర్ మారిస్తే గానీ విజయం దక్కదనే విషయం వారిద్దరికీ తెలుసు. స్టార్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ సంధించిన ఓవర్ అది. పైగా ఆ ఓవర్ తొలి నాలుగు బంతుల్లో వచ్చింది మూడు పరుగులే. ఆ తరువాత కోహ్లీ విజృంభించాడు.

మారిన సమీకరణాలు..

మారిన సమీకరణాలు..

ఆ ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఎవ్వరూ ఊహించని విధంగా మెరుపువేగంతో ఆ రెండు బంతులను ఫెన్సింగ్ దాటించాడు. 19వ ఓవర్‌లో 17 పరుగులు రావడంతో ఈక్వేషన్లు మారిపోయాయి. చివరి ఆరు బంతుల్లో 16 పరుగులు అవసరం అయ్యాయి టీమిండియాకు. దాన్ని లాంఛనంగా ముగించాడు కోహ్లీ.

ఆ రెండు సిక్సర్లపై..

ఆ రెండు సిక్సర్లపై..

హ్యారిస్ రవూఫ్ వేసిన 19వ ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలచడం పట్ల విరాట్ కోహ్లీ స్పందించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. వాటి గురించి ఎలా స్పందించాలో తనకు తెలియట్లేదని చెప్పాడు. 19వ ఓవర్‌లో ఖచ్చితంగా రెండు సిక్సర్లు కొడితే గానీ చివరి ఓవర్‌లో తమపై పడే భారాన్ని, ఒత్తిడిని అధిగమించలేమని భావించానని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

బంతిపైనే ఫోకస్..

బంతిపైనే ఫోకస్..

తొలి నాలుగు బంతుల్లో మూడు పరుగులే రావడం తనను కొంత ఆందోళనకు గురి చేసిందని కోహ్లీ చెప్పాడు. చివరి రెండు బంతులను సిక్సర్లుగా కొట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నానని పేర్కొన్నాడు. అయిదో బంతిని స్టింటెడ్ షాట్‌గా మలిచానని చెప్పాడు. బంతిపైనే ఫోకస్ పెట్టాలని, అది ఎలా వచ్చినా గానీ.. కదలకుండా షాట్ ఆడాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నాడు. బంతిని కనెక్ట్ కావడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చానని అన్నాడు.

కేరీర్ మొత్తంపై

కేరీర్ మొత్తంపై

అలాంటి రీస్కీ షాట్లను ఆడాల్సిన అవసరం కూడా ఉందని తనకు అనిపించిందని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. బెయిల్స్ ఎత్తులో వచ్చిన బంతిని స్ట్రెయిట్ షాట్ ఆడానని గుర్తు చేశాడు. బౌలర్ తల మీదుగా టెక్నిక్‌కు పవర్‌ను జోడించి ఆ షాట్ ఆడానని పేర్కొన్నాడు. చివరి బంతిని హ్యారిస్ రవూఫ్ ఎలా వేస్తాడనే విషయం మీద అప్పుడే తనకు ఓ స్పష్టత ఏర్పడిందని, దాన్ని కూడా షాట్ ఆడాలని అనుకున్నట్లు వివరించాడు. లెగ్ స్టంప్‌పైకి వేసిన బంతిని సింపుల్‌గా ఫ్లిక్ చేశానని అన్నాడు.

Story first published: Monday, October 24, 2022, 14:02 [IST]
Other articles published on Oct 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+