గంగూలీ రికార్డు సమం: అరుదైన రికార్డుకి 'సెంచరీ' దూరంలో కోహ్లీ
హైదరాబాద్: అభిమానులు ఏ ముహూర్తన విరాట్ కోహ్లీకి 'ఛేజ్ మాస్టర్' అని పేరు పెట్టారో తెలియదు గానీ ఆ పేరుకి తగ్గట్లుగానే న్యాయం చేస్తున్నాడు. తాజాగా, డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 270 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి టీమిండియా కెప్టెన్ కోహ్లీ సెంచరీతో రాణించడంతో 4.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది.

విరాట్ కోహ్లీ అరుదైన ఘనత
సఫారీ గడ్డపై టీమిండియా ఛేజ్ చేసిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు. కెప్టెన్లుగా కోహ్లీ, గంగూలీలు ఇద్దరూ విదేశాల్లో 11 సెంచరీలు చేశారు.

కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే
ఇందుకు గాను గంగూలీకి 142 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, కోహ్లీకి కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతేకాదు సఫారీ గడ్డపై కోహ్లీకి వన్డేల్లో ఇది తొలి సెంచరీ కావడం విశేషం. ఈ సిరిస్‌లో ఇంకా ఐదు వన్డేలు మిగిలున్నాయి. ఈ క్రమంలో కోహ్లీ ఇంకా ఒక్క సెంచరీ సాధిస్తే గంగూలీ రికార్డుని అధిగమిస్తాడు.
33కు చేరిన కోహ్లీ సెంచరీల సంఖ్య
మరోవైపు అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో కోహ్లీ సెంచరీల సంఖ్య 33కు చేరింది. ఇందులో విరాట్ కోహ్లీ 20 సెంచరీలను ఛేజింగ్‌లోనే సాధించడం విశేషం. 20 సెంచరీల్లో 18 సెంచరీలు జట్టుకు విజయాన్ని అందించాయి. కోహ్లీ తన కెరీర్‌లో మొత్తంలో విదేశీ గడ్డపై 15 సెంచరీలు చేశాడు.

తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో ఘన విజయం
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 270 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 45.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ (112), రహానే (79) పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. తాజా విజయంతో ఆరు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications