విదేశాల్లో టెస్టులను గెలిచిన కెప్టెన్లలో టాప్ స్థానంలో కోహ్లీ

మెల్‌బౌర్న్: మెల్‌బౌర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్-భారత్ జట్లు హోరాహోరీగా పోరాడాయి. ఈ పోరాటంలో ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియా 150వ టెస్టు విజయం సాధించిన ఘనతతో పాటు మరికొన్ని రికార్డులు పొందింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సాధించాడు. ఆసీస్‌తో మూడో టెస్టులో భారత్ 137 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరిరోజు ఆటలో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ భారీ విజయం సాధించింది.

బాక్సింగ్ డే టెస్టు విజయాన్ని తొలిసారి
258/8 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ మరో మూడు పరుగులు చేసి మిగతా రెండు వికెట్లను కోల్పోవడంతో భారత్ బాక్సింగ్ డే టెస్టు విజయాన్ని తొలిసారి సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియాకి వెలుపల విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించి అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్ల జాబితాలో సౌరవ్ గంగూలీతో కలిసి కోహ్లి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇప‍్పటివరకూ విదేశాల్లో 24 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి 11 విజయాలు సాధించాడు.

28 టెస్టుల్లో గంగూలీ.. కోహ్లీ 11
ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా గెలుపు తర్వాత గంగూలీతో కలిసి అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. కాగా, గంగూలీ విదేశాల్లో 28 టెస్టుల్లో కెప్టెన్సీ వహించి 11 విజయాలు సాధించాడు. అలాంటిది కోహ్లి కేవలం 24 టెస్టుల్లోనే ఆ గెలుపు మార్కును చేరుకోవడం విశేషం. విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో గంగూలీ, కోహ్లిల తర్వాత స్థానాల్లో ఎంఎస్ ధోని(6), రాహుల్ ద్రవిడ్(5)లు ఉన్నారు.

ఏడాది 4 విదేశీ టెస్టు విజయాల్ని భారత్
దాంతో పాటుగా విదేశీ టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విజయాల్ని సాధించిన జట్టుగా భారత్ ఘనత సాధించింది. ఈ ఏడాది 4 విదేశీ టెస్టు విజయాల్ని భారత్ సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జోహనెస్‌బర్గ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌ను గెలిచిన భారత్.. ఇంగ్లండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన మ్యాచ్‌ను విజయంతో ముగించింది. ఆసీస్‌తో ప్రస్తుత సిరీస్‌లో భాగంగా అడిలైడ్, మెల్‌బౌర్న్ టెస్టులు భారత్ ఖాతాలో చేరాయి. 1968లో న్యూజిలాండ్‌పై వారి దేశంలో గెలిచిన టెస్టు మ్యాచ్‌ల రికార్డును భారత్ తాజాగా మార్చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications