Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ రికార్డు సమం: ముంబైలో కోహ్లీ రికార్డులివే

హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలోని జరుగుతున్న నాలుగో టెస్టులో రికార్డుల మోత మోగుతుంది. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని సమం చేశాడు. ముంబై టెస్టులో కోహ్లీ 187 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 11 ఫోర్ల సాయంతో సెంచరీని పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

నాలుగో టెస్టులో కోహ్లీ చేసిన సెంచరీ టెస్టుల్లో 15వది కాగా, కెప్టెన్‌గా 8వది. అంతేకాదు ఒక కేలండర్ ఇయర్‌(2016)లో కోహ్లీకి నాలుగో సెంచరీ కావడం విశేషం. గతంలో 1997లో సచిన్ టెండూల్కర్ కూడా కెప్టెన్‌గా నాలుగు టెస్టు సెంచరీలు చేశాడు. అయితే ఇప్పుడు కోహ్లీ ముంబై టెస్టు సెంచరీతో సమం చేశాడు.

ఇక ఈ జాబితాలో ఆసియాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే 5 సెంచరీలతో మొదటి స్ధానంలో ఉన్నాడు. సచిన్, కోహ్లీల మాదిరే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్ కూడా ఒక కేలండర్ ఇయర్‌లో నాలుగు టెస్టు సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు.

Virat Kohli equals Sachin Tendulkar's record in Mumbai test.

ఇక ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టలో టీమిండియా పటిష్ట స్థితికి చేరుకుంది. మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ 142 ఓవర్లకు గాను 7 వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజైన శనివారం ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్‌పై 51 పరుగుల ఆధిక్యం భారత్‌కు లభించింది.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ 147, జయంత్ యాదవ్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో టెస్టులో కెప్టెన్ కోహ్లీ పలు రికార్డులను సృష్టించాడు. ఒక కేలండర్ ఇయర్‌లో 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దీంతో 2016లో విరాట్ కోహ్లీ టెస్టుల్లో 1000 పరుగులు సాధించినట్లైంది.

గతంలో ఈ రికార్డుని టీమిండియా కెప్టెన్లుగా ఇద్దరు మాత్రమే సాధించారు. 1997లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, 2006లో రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రమే ఈ ఘనత అందుకున్న కెప్టెన్లుగా ఉన్నారు. విరాట్ కోహ్లీ సాధించిన 1000 పరుగుల్లో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

అంతేకాదు టెస్టు సిరిస్‌లో 500కు పైగా పరుగులు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా కోహ్లీ గుర్తింపు పొందాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6వ పరుగు సాధించే క్రమంలో ఈ సిరీస్‌లో కోహ్లీ 500 పరుగుల మార్కును చేరాడు. దీంతో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రికార్డుని కోహ్లీ సమం చేశాడు.

ఒక సిరిస్‌లో 500కు పైగా పరుగులను గవాస్కర్ రెండు సార్లు సాధించాడు. 1978-79 సీజన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో గవాస్కర్ ఐదు వందలకు పైగా పరుగులు చేశాడు. ఆ తర్వాత 1981-82 సీజన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో గవాస్కర్ ఐదు వందల పరుగుల మార్కును రెండోసారి సాధించి చరిత్ర సృష్టించాడు.

ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు నమోదు చేసిన భారత కెప్టెన్లను పరిశీలిస్తే అందులో సునీల్ గవాస్కర్ 11 సెంచరీలతో మొదటిస్ధానంలో ఉన్నాడు. కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన భారత కెప్టెన్లు వీరే

* సునీల్ గవాస్కర్ - 11
* మహ్మద్ అజారుద్దీన్ - 9
* విరాట్ కోహ్లీ - 8
* సచిన్ టెండూల్కర్ - 7
* పటౌడీ,గంగూలి,ధోనీ - 5

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+