Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు: డకౌట్లలో కపిల్ రికార్డు సమం

Virat Kohli equals Kapil Dev's dubious record of most ducks for an Indian captain

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో 11 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

దీంతో ఒక ఏడాదిలో అత్యధిక డకౌట్లు అయిన టీమిండియా కెప్టెన్‌గా కపిల్ దేవ్ రికార్డుని సమం చేశాడు. 1983లో కపిల్ దేవ్ కూడా ఇలాగే ఏడాదిలో ఐదుసార్లు డకౌట్ అయ్యాడు. ఇప్పుడు ఈ రికార్డును కోహ్లీ సమం చేశాడు. తాజాగా, కోల్‌కతా టెస్టులో ఖాతా తెరవకుండానే కోహ్లీ పెవిలియన్ చేరడం ఐదోసారి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో పుణెలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ తొలిసారి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రెండోసారి, సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో చెన్నైలో జరిగిన వన్డేలో మూడోసారి, గువహటిలో జరిగిన టీ20లో నాలుగోసారి కోహ్లీ ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఇప్పుడు, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంక బౌలర్ సురంగ లక్మల్ బౌలింగ్‌లో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇలా ఈ ఏడాది విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా చేతిలో మూడు సార్లు, శ్రీలంక చేతిలో రెండు సార్లు డకౌట్ అయి పెవిలియన్‌కు చేరాడు. అంతేకాదు 2011, 2014లలో జరిగిన టెస్టుల్లో కూడా విరాట్ కోహ్లీ రెండు సార్లు డకౌట్లు అయ్యాడు.

1976లో మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ పరుగులు చేయకుండానే నాలుగుసార్లు డకౌటయ్యాడు. మాజీ క్రికెట్ దిగ్గజం, ప్రస్తుత క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఈ రికార్డుని 2001, 2002లో నమోదు చేశాడు. 2011లో ధోని కూడా నాలుగుసార్లు డకౌటయ్యాడు.

ఈ ఏడాది కోహ్లీ డకౌట్ అయిన సందర్భాలు:
vs Australia at Pune on 23 February (1st Innings, Test)
vs Sri Lanka at The Oval on 8 June (ODI)
vs Australia at Chennai on 17 September (ODI)
vs Australia at Guwahati on 10 October (T20I)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, November 17, 2017, 10:19 [IST]
Other articles published on Nov 17, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+