Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2017లో చివరి ర్యాంకులు: వన్డేల్లో కోహ్లీ నెంబర్ వన్, టెస్టుల్లో ఎక్కడ?

Virat Kohli

హైదరాబాద్: 2017 సంవత్సరానికి గాను డిసెంబర్ 31(ఆదివారం) ముగింపు రోజున టెస్టు ర్యాంకింగ్స్ జాబితాని ఐసీసీ విడుదల చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 893 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఈ ఏడాది టెస్టుల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 947 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో మెల్ బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో స్టీవ స్మిత్ తొలి ఇన్నింగ్స్‌లో 76, రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులతో నాటౌట్‌తో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ టెస్టులో 244 పరుగులతో డబుల్ సెంచరీ చేసిన ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ అలెస్టర్‌ కుక్‌ తొమ్మిది స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్ధానంలో నిలిచాడు.

ఈ ఏడాదిని 15వ ర్యాంక్‌తో ఆరంభించిన కుక్ టాప్-10లో చోటు సంపాదించాడు. ఇక మూడవ స్ధానంలో ఛటేశ్వర్ పుజారా (873), న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (855), ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (855) నిలిచారు. మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్ ఆరో స్థానంలో నిలిచాడు.

ఇక, బౌలర్ల ర్యాంకింగ్స్‌ జాబితాలో ఎలాంటి మార్పులు జరగలేదు. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా 870 పాయింట్లతో మూడో స్థానం నిలవగా తర్వాత నాలుగో స్ధానంలో రవిచంద్రన్ అశ్విన్ (829) నిలిచాడు. ఈ ఏడాది ఒకానొక దశలో వీరిద్దరూ అగ్రస్థానం కోసం పోటీపడిన సంగతి తెలిసిందే.

అగ్రస్థానంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌ (892) కొనసాగుతున్నాడు. శ్రీలంక బౌలర్‌ రంగనా హెరాత్‌ ఆరో స్ధానంలో నిలిచాడు. ఆసీస్ పేసర్‌ హేజిల్‌వుడ్‌ ఐదో ర్యాంకుని దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్‌ మోర్నీ మోర్కెల్‌ మూడు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకు దక్కించుకున్నాడు.

ఆల్‌రౌండర్‌ జాబితాలో బంగ్లాదేశ్‌కు చెందిన షకిబ్‌ అల్‌ హసన్‌ అగ్రస్ధానంలో నిలవగా.... రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో ఉన్నారు. ఇక, వన్డే ర్యాంకుల బ్యాట్స్‌మెన్ జాబితా విషయానికి వస్తే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్ధానంలో నిలిచాడు.

ఈ ఏడాది విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆరు సెంచరీలు నమోదు చేయడంతో పాటు, టెస్టుల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. కోహ్లీ తర్వాత భారత్ నుంచి రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మంచి ప్రదర్శన చేశారు. టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీని రోహిత్ శర్మ నమోదు చేశాడు.

దీంతో వన్డేల్లో రోహిత్ శర్మ ఐదో స్ధానంతో ఈ ఏడాదిని ముగించగా... ధోని పన్నెండవ స్ధానం, ధావన్ 14వ స్ధానాన్ని దక్కించుకున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, December 31, 2017, 19:16 [IST]
Other articles published on Dec 31, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+