
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డుని సమం చేశాడు. జోహెన్స్‌బర్గ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో దక్షిణాఫ్రికాపై కోహ్లీసేన 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనిశ్చితి పరిస్థితుల మధ్య వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై టీమిండియా గెలవడం నిజంగా అద్భుతం.
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ల్లో భాగంగా అంతకముందు జరిగిన రెండు టెస్టుల్లో టీమిండియా ఓటమి పాలవడంతో సిరిస్‌ను 2-0తో చేజార్చుకుంది. అలాంటి సమయంలో మూడో టెస్టులో కోహ్లీసేన విజయం సాధిచడం అటు అభిమానులతో పాటు భారత క్రికెటర్లలో ఉత్సాహాన్ని నింపింది. ఈ విజయన్ని కోహ్లీసేన కూడా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంది.
ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఇప్పటవరకు దక్షిణాఫ్రికాలో టీమిండియా టెస్టు సిరిస్‌ను గెలవలేదు. ఈ సిరిస్‌కు ముందు కోహ్లీసేన అద్భుతమైన ఫామ్‌లో ఉండటాన్ని చూసి సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికా విజయం సాధిస్తుందని అందరూ ఊహించారు. అయితే అలా జరగలేదు. చివరకు 1-2తేడాతో సిరిస్‌ను చేజార్చుకుంది.
1992 నుంచి ఇప్పటివరకు సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో టీమిండియా 20 టెస్టు మ్యాచ్‌లాడింది. ఇందులో కేవలం మూడు టెస్టుల్లో మాత్రమే భారత్ విజయం సాధించడం విశేషం. జోహెన్స్ బర్గ్ టెస్టు విజయంతో విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టెస్టుల్లో అత్యధిక విజయాల రికార్డుని సమం చేశాడు.
టెస్టుల్లో భారత్‌కు అత్యధిక విజయాలనందించిన జాబితాలో మహేంద్ర సింగ్ ధోని (27) అగ్రస్ధానంలో ఉండగా.... విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ (21) విజయాలతో రెండో స్థానంలో ఉన్నారు. అయితే, ఇక్కడ విరాట్ కోహ్లీకి విజయశాతం ఎక్కువగా ఉండటం విశేషం. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 35 టెస్టులకు ప్రాతినిథ్యం వహించగా, కేవలం 5 టెస్టుల్లో మాత్రమే భారత్ ఓటమి పాలైంది.
సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాను ఓడించిన మూడో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అంతకముందు 2006లో ఇదే వేదికపై రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియా విజయం సాధించగా, ఆ తర్వాత 2010లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా డర్బన్ వేదికగా జరిగిన టెస్టులో విజయం సాధించింది.
భారత్ విజయం సాధించిన ఈ మూడు సార్లు జట్టులో మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ సభ్యులుగా ఉన్నారు. జోహెన్స్ బర్గ్‌లో మూడో టెస్టులో విజయం సాధించడంతో టీమిండియా తన రికార్డుని సజీవంగా ఉంచుకుంది. జోహెన్స్ బర్గ్‌లో టీమిండియా ఐదు టెస్టులాడగా రెండింటిలో విజయం సాధించగా, మూడింటిని డ్రాగా చేసుకుంది.
టీమిండియాకు అత్యధిక విజయాలను అందించిన కెప్టెన్లు:
* MS Dhoni - 27 wins (60 matches, Lost 18)
* Virat Kohli - 21 (35, Lost 5)
* Sourav Ganguly - 21 (49, Lost 13)
* Mohammad Azharuddin - 14 (47, Lost 14)
* Sunil Gavaskar - 9 (47, Lost 8)
* Mansur Ali Khan Pataudi - 9 (40, Lost 19)
* Rahul Dravid - 8 (25, Lost 6)
India's Test wins in South Africa
* December 2006 - India won by 123 runs in Johannesburg (Man-of-the-match - S Sreesanth)
* December 2010 - India won by 87 runs in Durban (Man-of-the-match - VVS Laxman)
* January 2018 - India won by 63 runs in Johannesburg (Man-of-the-match - Bhuvneshwar Kumar)
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.