డబుల్ 'డబుల్': గవాస్కర్, క్లార్క్ రికార్డుని సమం చేసిన కోహ్లీ
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో శుక్రవారం పలు రికార్డులు నమోదయ్యాయి. టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ టెస్టుల్లో కోహ్లీ వరుసగా నాలుగో డబుల్ సెంచరీని సాధించాడు. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా నాలుగు సిరీస్‌లలో నాలుగు డబుల్ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
రెండో రోజు 111 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ డబుల్ సెంచరీని సాధించాడు. అంతక ముందు కోహ్లీ ఆడిన వెస్టిండిస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సిరిస్‌లలో వరుసగా మూడు డబుల్ సెంచరీలు చేసిన కోహ్లీకి ఇది నాలుగో డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్‌మన్, రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజాలను కోహ్లీ అధిగమించాడు.
క్రికెట్ దిగ్గజాల సరసన చేరిన కోహ్లీ
తాజాగా కోహ్లీ నాలుగో డబుల్ సెంచరీతో క్రికెట్ దిగ్గజాల సరసన చేరాడు. ఇప్పటివరకు టెస్టుల్లో పది మంది క్రికెటర్లు మాత్రమే నాలుగు డబుల్ సెంచరీలు ఫీట్‌ను సాధించారు. టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా సర్ డాన్ బ్రాడ్‌మన్ అగ్రస్ధానంలో ఉన్నాడు. డాన్ బ్రాడ్‌మన్ 52 మ్యాచ్‌ల్లో 12 డబుల్ సెంచరీలు సాధించాడు.

భారత్‌లో టాప్ సచిన్, సెహ్వాగ్
ఇక భారత క్రికెటర్ల విషయానికి వస్తే సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లు 6 డబుల్ సెంచరీలతో సమానంగా ఉన్నారు. వీరి తర్వాత 5 డబుల్ సెంచరీలతో 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. జులై 2016లో వెస్టిండిస్‌తో నార్త్ సౌత్‌లో జరిగిన టెస్టులో విరాట్ కోహ్లీ తొలి డబుల్ సెంచరీ (200)ని సాధించాడు.

గతేడాది వరుసగా మూడు సెంచరీలు
ఆ తర్వాత అదే ఏడాది న్యూజిలాండ్‌పై (211), ఇంగ్లాండ్‌పై (235) వరుసగా మూడు డబుల్ సెంచరీలు నమోదు చేశాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా వాంఖడె స్టేడియంలో ఇంగ్లాండ్‌పై చేసిన 235 పరుగులే టెస్టుల్లో కోహ్లీ అత్యధికం. 28 ఏళ్ల కోహ్లీ 2011లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు కోహ్లీకి 54వ టెస్టు.

టెస్టు క్రికెట్‌లో అత్యధికంగా డబుల్ సెంచరీని సాధించిన
ఆటగాళ్లు (టాప్ 7):
12 - డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా)
11 - కుమార సంగక్కర (శ్రీలంక)
9 - బ్రియాన్ లారా (వెస్టిండిస్)
7 - వాలీ హమ్మండ్ (ఇంగ్లాండ్), మహిళా జయవర్దనే (శ్రీలంక)
6 - మర్వన్ ఆటపట్టు (శ్రీలంక), వీరేంద్ర సెహ్వాగ్ (ఇండియా), జావేద్ మియాందాద్ (పాకిస్తాన్), యూనిస్ ఖాన్ (పాకిస్తాన్), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), సచిన్ టెండూల్కర్ (ఇండియా)
5 - గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా), రాహుల్ ద్రావిడ్ (ఇండియా)
4 - విరాట్ కోహ్లీ (ఇండియా), జహీర్ అబ్బాస్ (పాకిస్తాన్), లెన్ హట్టన్ (ఇంగ్లాండ్), గ్రెగ్ ఛాపెల్ (ఆస్ట్రేలియా), మహ్మద్ యూసుఫ్ (పాకిస్తాన్), హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా), బ్రెండన్ మెక్కలమ్ (న్యూజిలాండ్), గోర్డాన్ గ్రీనిడ్జ్ (వెస్ట్ ఇండీస్), మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా), సునీల్ గవాస్కర్ (ఇండియా)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications