Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Test Rankings: ఐదుకు పడిపోయిన కోహ్లీ.. మూడుకు ఎగబాకిన రూట్!!

Virat Kohli down to fifth in ICC Test Rankings, Joe Root moves up to third

దుబాయ్‌: ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఓ స్థానం కోల్పోయి ఐదో ర్యాంకుకు పడిపోయాడు. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 852 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. భారత్‌తో తొలి టెస్టులో డబుల్‌ సెంచరీతో విజృంభించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ‌(218) రెండు స్థానాలను మెరుగుపరచుకొని మూడో ర్యాంకుకు ఎగబాకాడు. రూట్ 883 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ (878) ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంకుకు పడిపోయాడు.

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. విలియమ్సన్ ఖాతాలో ప్రస్తుతం 919 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్ (891) ఉన్నాడు. విలియమ్సన్‌, రూట్‌ మధ్య కేవలం 36 పాయింట్ల వ్యత్యాసం ఉంది. రెండో స్థానంలో ఉన్న స్మిత్‌.. రూట్‌ కన్నా 8 పాయింట్లు ముందంజలో ఉన్నాడు. పాకిస్థాన్‌ సారథి బాబర్‌ అజామ్ ‌(ఆరో స్థానం), ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ బెన్ ‌స్టోక్స్ ‌(తొమ్మిదో స్థానం) చెరో ర్యాంకు మెరగుపరచుకున్నారు.

భారత టెస్టు స్పెషలిస్ట్‌ చెతేశ్వర్‌ పుజారా ఒక స్థానం కోల్పోయి ఏడో ర్యాంకుకు పడిపోయాడు. పుజారా ఖాతాలో ప్రస్తుతం 754 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. చెన్నై టెస్టులో భారత యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ మినహా భారత బ్యాట్స్‌మెన్‌ పరుగులు సాధించడంలో విఫలమైన విషయం తెలిసిందే. అందుకే టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో కిందకు పడిపోయారు. టాప్-10లో ఉండే అజింక్య రహానేకు ఈసారి చోటే దక్కలేదు.

టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ 908 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ సీనియర్ ప్లేయర్స్ స్టువర్ట్ బ్రాడ్ (830), జేమ్స్ ఆండర్సన్ (826) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ (771), జస్ప్రీత్ బుమ్రా (769) ఏడు, ఎనమిది స్థానాల్లో ఉన్నారు.

చెన్నై టెస్టు ఫలితం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసును ఆసక్తికరంగా మార్చేసింది. అగ్రస్థానంలో ఉన్న భారత్‌ నాలుగో స్థానానికి పడింది. నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ 70.2 పాయింట్ల శాతంతో నంబర్‌వన్‌ స్థానానికి దూసుకెళ్లింది. సిరీస్‌లో ఇంగ్లండ్‌ మరో మ్యాచ్ గెలిస్తే.. ఫైనల్‌ చేరే అవకాశం భారత్ (68.3) చేజారుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్‌ (70) ఒక ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. మరో బెర్తు కోసం భారత్‌, ఇంగ్లండ్‌‌తో పాటు ఆస్ట్రేలియా (69.2) మధ్య పోటీ నెలకొంది.

Story first published: Wednesday, February 10, 2021, 16:03 [IST]
Other articles published on Feb 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+