Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సలహాలు అవసరం: మ్యాచ్‌ను అంచనా వేయడంలో ధోని తర్వాతే కోహ్లీ

IPL 2019 : Virat kohli Does Not Have Game Reading Skill Like MS Dhoni Says Benerjee ! | Oneindia
Virat Kohli doesn’t have MS Dhoni’s match-reading skills: Former India captain’s childhood coach

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అవ్వొచ్చు కానీ... మ్యాచ్‌ను మలుపు తిప్పే అంశంలో మహేంద్ర సింగ్ ధోని తర్వాతేనని కెప్టెన్ కూల్ చిన్ననాటి కోచ్ కేశబ్ రంజన్ బెనర్జీ అన్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ధోని చేసేటటువంటి ఫీల్డింగ్ రీప్లేస్‌మెంట్‌లు మ్యాచ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తాయని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

గురువారం ధోని క్రికెట్ అకాడమీ క్లినిక్ సమ్మర్ క్యాంప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేశవ్ రంజన్ బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ "మ్యాచ్‌ను అంచనా వేయడంలో, మ్యాచ్ ప్రణాళికలను రచించడంలో ధోనీకి అపారమైన అనుభవముంది. ఈ విషయంలో కోహ్లీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది" అని అన్నాడు.

"ధోనికి భారత జట్టులో చోటు దక్కకపోతే అతడికి సలహాలు ఇచ్చే వారెవరు ఉండరు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ... ధోని సలహాలు అతడికి చాలా అవసరం. బ్యాట్స్‌మన్‌గా పరుగులు సాధించటంలో సఫలమవుతున్న విరాట్ పరిస్థితులకు తగ్గట్లు వ్యుహాలు రచించడంలో విఫలమవుతున్నాడు" అని బెనర్జీ అన్నాడు.

"కాబట్టి ధోనీ నుంచి సలహాలు, సూచనలు అందుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఒత్తిడికి తలొగ్గకుండా నిర్ణయాలు తీసుకోవడంలో అనుభవమున్న ధోనీ సాయం కోహ్లీ తీసుకోవాలి. ప్రపంచకప్‌లో ధోని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే భారీ స్కోర్లు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. క్రికెట్‌లో కొనసాగేందుకు ఫిట్‌నెస్ చాలా కీలకం" అని బెనర్జీ చెప్పాడు.

Story first published: Friday, May 10, 2019, 12:32 [IST]
Other articles published on May 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+