
హైదరాబాద్: దక్షిణాఫ్రికా, భారత్‌కు మధ్య టెస్టు సిరీస్ ఇటీవలే ముగిసింది. ఈ సిరీస్‌లో భారత్ 2-1 స్కోరుతో ఓటమి పాలైంది. ఒకటి, రెండు టెస్టుల్లో ఘోర పరాజయం చవిచూసిన భారత జట్టు మూడో టెస్టులో గెలిచినా ప్రయోజనం లేకుండా పోయింది. ఓడిపోయిన రెండు టెస్టుల్లోనూ రహానె లేకపోవడం ప్రధాన లోపంగా క్రికెటర్లు, సీనియర్లు, క్రికెట్ అభిమానులతో సహా అందరూ విరాట్‌ను విమర్శించారు.
అలాంటప్పుడు రహానెను మూడో టెస్టుకు తీసుకున్న విరాట్ ఇప్పుడు వన్డేల్లోనూ తీసుకోవడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి విమర్శలకి తలొగ్గాడా..? వన్డే, టీ20 జట్టులో అజింక్య రహానెని మూడో ఓపెనర్‌గా మాత్రమే చూస్తున్నామని ఇటీవల చెప్పిన కోహ్లి.. తాజాగా అతడ్ని నాలుగో స్థానంలో ఆడించేందుకు సుముఖత దేనికి వ్యక్తం చేశాడు అని.
దక్షిణాఫ్రికాతో గత వారం ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో.. తొలి రెండు టెస్టుల్లోనూ రహానిని పక్కనపెట్టిన కోహ్లి.. రోహిత్ శర్మని ఆడించాడు. అయితే ఆ టెస్టుల్లో రోహిత్ ఘోరంగా విఫలమవడంతో కోహ్లిపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. విదేశీ గడ్డపై మెరుగైన బ్యాటింగ్ రికార్డు ఉన్న రహానెని తప్పించి.. పేలవ రికార్డున్న రోహిత్‌ని ఆడించడమేమిటని ప్రశ్నించారు. దీంతో మూడో టెస్టులో రోహిత్‌ని తప్పించి మళ్లీ రహానెని తుది జట్టులోకి కోహ్లి తీసుకొచ్చాడు.
దక్షిణాఫ్రికాతో గురువారం నుంచి ఆరు వన్డేల సిరీస్‌లో భారత్ ఢీకొట్టనుంది. ఈ రోజు సాయంత్రం డర్బన్ వేదికగా 4.30 నుంచి తొలి వన్డే ప్రారంభంకానుంది. దీంతో అజింక్య రహానెని తుది జట్టులో ఆడిస్తామని విరాట్ కోహ్లి పరోక్షంగా వెల్లడించాడు.
'రహానెను మూడో ఓపెనర్‌గా చూస్తున్నామని గతంలో చెప్పా. కానీ.. 2015 ప్రపంచకప్‌లో అతను నాలుగో స్థానంలో మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికా గడ్డపై వన్డేల్లో ఎక్కువగా పేసర్లని ఎదుర్కోవాల్సి ఉంది. కాబట్టి.. నాలుగో స్థానంలో సీనియర్ బ్యాట్స్‌మెన్ ఉంటే బాగుంటుందని భావిస్తున్నాం. అంతేకాకుండా 2019 ప్రపంచకప్ ఇంగ్లాండ్‌లో జరగనున్న నేపథ్యంలో నాలుగో స్థానంలో మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్‌మెన్‌కి అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం' అని కోహ్లి తాజాగా వ్యాఖ్యానించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.