Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కింగ్ కోహ్లీకి ఏమైంది?: అయిదు మ్యాచ్‌లల్లో రెండు డకౌట్లా: శకం ముగిసినట్టేనా?

Virat Kohli deserves a bit more luck, says Gavaskar, As the West Indies series proved to be a disaster

అహ్మదాబాద్: టీమిండియా బ్యాటింగ్ వెన్నెముక విరాట్ కోహ్లీకి ఏమైంది?.. అన్ని ఫార్మట్లకు కేప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న తరువాత మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్‌పై దృష్టి సారిస్తాడని, పరుగుల వరద పారిస్తాడని ఆశించిన సగటు అభిమానిని తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు కింగ్ కోహ్లీ. క్రీజ్‌లో పాతుకోలేకపోతున్నాడు. షాట్ల ఎంపికలో అతని తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది. తన ట్రేడ్ మార్క్ షాట్లను ఆడలేకపోతున్నాడు.

మూడు వన్డేల్లో..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్‌తో ఆరంభమైన మూడో వన్డేలో కూడా విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలం అయ్యాడు. ఎదుర్కొన్న రెండో బంతికే అవుట్ అయ్యాడు. ఇది అతని గోల్డెన్ డక్. వెస్టిండీస్‌తో ఆడిన ఈ మూడు వన్డేల్లోనూ కోహ్లీ చేసిన పరుగులు 26 మాత్రమే. తొలి వన్డేలో 4, రెండో వన్డేలో 18 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను తన ఖాతాను తెరవలేకపోయాడు. ఈ వన్డే సిరీస్ విరాట్ కోహ్లీ కేరీర్‌లో అత్యంత అధ్వాన్నమైనదిగా చెప్పుకోవచ్చు.

కీపర్‌కు క్యాచ్..

ఇన్నింగ్ నాలుగో ఓవర్ అయిదో బంతికి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 16 పరుగులే. జోసెఫ్ లెగ్ సైడ్ వేసిన బంతిని ఆడబోయిన విరాట్ కోహ్లీ టైమింగ్ మిస్ అయ్యాడు. అది కాస్తా బ్యాట్‌ను ముద్దాడుతూ వెళ్లి వికెట్ కీపర్ షైహోప్ చేతుల్లో వాలింది. తన పరుగుల ఖాతాను తెరవకుండానే పెవిలియన్ దారి పట్టాడు కోహ్లీ. సున్నా స్కోరుతో విండీస్‌తో వన్డే సిరీస్‌ను ముగించాడు. అతని వైఫల్యం కాస్తా- నెటిజన్లకు చేతినిండా పని పెట్టింది.

2019 తరువాత..

నిజానికి- విరాట్ కోహ్లీ చాలాకాలంగా వన్డే ఇంటర్నేషనల్స్‌లల్లో సత్తా చాటలేకపోతున్నాడు. 2019 నవంబర్ తరువాత సెంచరీ చేయడానికి మొహం వాచి పోయాడు కోహ్లీ. వన్డే ఇంటర్నేషనల్స్‌లల్లో చివరిసారిగా 2019లో మూడంకెల స్కోర్ చేశాడు. ఆ తరువాత ఫామ్‌లోకి రాలేకపోతున్నాడు. విరాట్ ఆడిన చివరి అయిదు వన్డేల్లో ఇది రెండో డకౌట్ కావడాన్ని బట్టి చూస్తే- అతని ఫామ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న తరువాతా ఫామ్‌లోకి రాకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సునీల్ కామెంట్స్..

విరాట్ కోహ్లీకి కొంత అదృష్టం కూడా కలిసి రావాలంటూ మ్యాచ్ ఆరంభానికి ముందు సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్‌.. నిజమే అనిపించాయి ఆ క్షణంలో. కొంతకాలంగా అతను వివాదాలకు కూడా కేంద్రబిందువు అవుతూ వస్తోన్నాడు. టీ20, వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ కేప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ప్రత్యేకించి- టెస్ట్ కేప్టెన్సీని వదులుకుంటోన్న సమయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపై కోహ్లీ చేశాడని భావిస్తోన్న వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.

Story first published: Friday, February 11, 2022, 16:25 [IST]
Other articles published on Feb 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+