టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం భారత్‌లో భారీగా సంపాదిస్తున్న క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. సుమారు రూ. వెయ్యి కోట్లకు పైగా ఆదాయంతో కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. అతను సోషల్ మీడియాలో కూడా బాగా సంపాదిస్తాడని వార్తలు వచ్చాయి. ఇన్‌స్టాలో అతను ఒక్కో పోస్టుకు రూ.11.45 కోట్లు చార్జ్ చేస్తాడని కథనాలు వెల్లడించాయి.
ఇలా సంపాదించడం వల్లనే అతను నెంబర్ వన్ సంపాదనాపరుడిగా ఎదిగాడని తెలిసింది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఆసియాలో అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్న సెలెబ్రిటీగా కోహ్లీ ఎదిగాడు. ఈ క్రమంలో అంతర్జాతీయంగా అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న టాప్-20 సెలెబ్రిటీల్లో భారత్ నుంచి కోహ్లీ ఒక్కడే ఉన్నాడు.

క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ, సెలెనా గోమెజ్ వంటి వారి సరసన చేరాడు. దీంతో సోషల్ మీడియా ద్వారా కోహ్లీ సంపాదన భారీగా ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని విరాట్ కోహ్లీ తాజాగా ఒక ట్వీట్ చేశాడు. 'నా జీవితంలో నాకు దక్కిన ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. అయితే నా సోషల్ మీడియా సంపాదన గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు' అని కోహ్లీ తాజాగా ట్వీట్ చేశాడు.
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో రాణించిన విరాట్ కోహ్లీ.. విదేశీ గడ్డపై చాలా గ్యాప్ తర్వాత సెంచరీ చేశాడు. ఆ తర్వాత మూడు వన్డేల సిరీసులో కోహ్లీ ఆడాడు. మొదటి వన్డేలో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక మిగతా రెండు వన్డేల్లో అతన్ని టీం మేనేజ్‌మెంట్ పక్కన పెట్టేసింది. ఇక టీ20 సిరీసులో కోహ్లీ ఆడటం లేదు. ఇటీవలే ఛార్టెడ్ ఫ్లైట్‌లో కోహ్లీ స్వదేశానికి తిరిగొచ్చేసిన సంగతి తెలిసిందే.