మరో వివాదంలో కోహ్లీ: ఎందుకిలా చేస్తున్నాడు?
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ కోహ్లీ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. కోహ్లీ-కుంబ్లేల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో కోహ్లీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా కుంబ్లేను కోచ్‌గా నియమించిన సమయంలో తాను అతన్ని స్వాగతిస్తూ పెట్టిన ట్వీట్‌ను తొలగించాడు. 2016 జూన్ 23న భారత్ క్రికెట్ చీఫ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే ఎంపికయ్యాడు. ఆసమయంలో విరాట్ కుంబ్లేకు శుభాకాంక్షలు తెలుపుతూ 'కోచ్‌గా ఎంపికైనందుకు కుంబ్లే సార్‌కు శుభాకాంక్షలు, మీసారధ్యంలో జట్టు ముందుకు సాగుతుంది' అని అదే రోజు ట్వీట్ చేశాడు.
అలాగే కోచ్ పదవినుంచి కుంబ్లే దిగిపోయిన కొద్ది గంటల తర్వాత.. కోహ్లీ కారణంగానే కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కుంబ్లేపై చేసిన ఆ ట్వీట్లను కూడా తాజాగా కోహ్లీ తన ట్విట్టర్ ఖాతా నుంచి డిలీట్ చేశాడు. ఈ ట్వీట్ డిలిట్ చేసి తన పరిణతి లేని మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నాడు.
ఇప్పుడు ఆ ట్వీట్లు విరాట్ ట్విట్టర్ అకౌంట్‌లో కనిపించడం లేదు. కోహ్లీ కావాలనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడని ఓ వ్యక్తి దాని స్క్రీన్‌షాట్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అంతేకాదు ఇది చాలా సిల్లీగా ఉందంటూ అతను కామెంట్ చేశాడు. దీనిని బట్టి వీరిద్దరి నడుమ ఏ స్థాయిలో విభేదాలు పొడచూపాయో అర్థం చేసుకోవచ్చు.
కుంబ్లే వెల్‌కమ్ ట్వీట్‌ను డిలీట్ చేసిన కోహ్లీ
కుంబ్లే వెల్‌కమ్ ట్వీట్‌ను కోహ్లీ డిలీట్ చేశాడు. దాని ఒరిజినల్ లింక్ ఇదే చూడండి అంటూ అభిమాని ట్వీట్ చేశాడు.
ట్వీట్ డిలిట్ చేయడంపై అభిమానుల మండిపాటు
ఈ ట్వీట్ డిలిట్ చేసి తన పరిణతి లేని మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నాడు.
కోహ్లీ నుంచి నిజాన్ని కోరుకుంటున్న ఫ్యాన్స్
కుంబ్లే-కోహ్లీల మధ్య ఏం జరిగిందో అభిమానులు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో కోహ్లీ బయటికొచ్చి నిజం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కోహ్లీ పరిణితికి ఇది నిదర్శనం
కుంబ్లేపై చేసిన ఆ ట్వీట్లను కూడా తాజాగా కోహ్లీ తన ట్విట్టర్ ఖాతా నుంచి డిలీట్ చేశాడు. ఈ ట్వీట్ డిలిట్ చేసి తన పరిణతి లేని మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నాడు.
కుంబ్లే మాత్రం అలానే
విరాట్ కోహ్లీ తాను చేసిన ట్వీట్‌ను తొలగించినా.. అతనికి థ్యాంక్స్ చెబుతూ అప్పట్లో కుంబ్లే చేసిన ట్వీట్ మాత్రం అలాగే ఉండటం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications