Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను ఇక్కడ నిల్చున్నానంటే అందుక్కారణం నా భార్య అనుష్కనే.. సెంచరీ అనంతరం కోహ్లీ భావోద్వేగం

Virat Kohli Dedicated his 71st Century to his wife Anuskha Sharma and Daugher Vamika

ఆసియా‌కప్‌లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తన 71వ అంతర్జాతీయ సెంచరీని రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు వెయ్యిరోజుల తర్వాత కోహ్లీ నుంచి సెంచరీ వచ్చింది. నవంబర్ 2019 నుండి కోహ్లీ సెంచరీ కొట్టలేదు. ఇక తన కెరీర్లో తొలి టీ20సెంచరీ కూడా చేశాడు. అద్భుతమైన సిక్సర్‌తో ఈ ఫీట్ సాధించాడు. సెంచరీ అనంతరం అతను సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న టైంలో చిందించిన చిరునవ్వుకు ఫిదా కాని భారత అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు.

ఇక ప్రేక్షకులకు అభివాదం చేసిన అనంతరం కోహ్లీ తన మెడలో ధరించిన చైన్‌ను, అలాగే తన వివాహ ఉంగరాన్ని ముద్దాడాడు. అలాగే ఆ టైంలో కొంచెం భావోద్వేగపూరితంగా కూడా కనిపించాడు. ఈ సెంచరీ కోహ్లీకి ఎందుకు స్పెషల్ అంటే.. 1019రోజుల సుదీర్ఘ విరామం తర్వాత తన సెంచరీ అందుకోవడమే. అతని (122పరుగులు నాటౌట్) ధాటికి భారత్ స్కోరు 2వికెట్లు కోల్పోయి 212 పరుగుల స్కోరు చేసింది. ఈ ఇన్నింగ్స్ అనంతరం.. సంజయ్ మంజ్రేకర్‌ కోహ్లీని పలు ప్రశ్నలు అడగగా అతను చెప్పిన సమాధానాలు అతను ఎంత స్ట్రగుల్ ఎదుర్కొన్నాడో తెలియజెప్పాయి.

'గత రెండున్నరేళ్లలో ఎన్నెన్నో అనుభవాలు. అవి నాకు చాలా నేర్పించాయి. మరో నెలలో నాకు 34ఏళ్లు పడతాయి. ఎప్పుడూ ఆవేశంగా సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకునే నేను ఇప్పుడూ అలా వ్యవహరించొద్దు. అందుకే ఈ సెంచరీ సెలబ్రేషన్స్ వేడుకలు గతానికంటే భిన్నమైనవి. సెంచరీ అనంతరం కాసేపు నేను కూడా షాక్ అయ్యాను. ఇది నేను సెంచరీ అందుకోవాల్సిన ఏకైక ఫార్మాట్ (టీ20). ఈ ఇన్నింగ్స్ ఎన్నో విషయాల సమాహారం. మా జట్టు బృందం ఓపెన్‌గా, సహాయకారిగా ఉంది.' అని కోహ్లీ చెప్పాడు.

'సెంచరీ తర్వాత నా చైన్, ఉంగరాన్ని ముద్దుపెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఇలా మీ ముందు మళ్లీ కమ్ బ్యాక్ అయ్యి నిల్చున్నానంటే దాని వెనకాల ఓ వ్యక్తి ఉంది. నా వైఫ్ అనుష్క ఈ సంధి కాలంలో ఎన్నోసార్లు నాకు అండగా నిలిచి ఉంది. ఈ సెంచరీని ఆమెకు, నా కూతురు వామికకు అంకితమిస్తున్నా. నా పక్కనే అనుష్క ఉండి నేను నిరాశ చెందకుండా నిరంతరం నాలో ప్రోత్సహం నింపింది. ఆరు వారాల సెలవు తర్వాత నేను రిఫ్రెష్ అయ్యాను. నేను ఎంత అలసిపోయానో అర్థమైంది. ఈ విరామం నన్ను మళ్లీ ఆటను ఆస్వాదించడానికి ఉపయోగపడింది.'అని కోహ్లీ తెలిపాడు.

Story first published: Thursday, September 8, 2022, 22:39 [IST]
Other articles published on Sep 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+