Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli : క్రికెట్‌కు ‘కింగ్’ పరిచయమైన రోజు.. 15 ఏళ్ల క్రితం కోహ్లీ అరంగేట్రం!

సరిగ్గా 15 ఏళ్ల క్రితం.. ప్రపంచ క్రికెట్‌లో ఒక అద్భుం జరిగింది. 2008లో శ్రీలంకతో జరిగిన మ్యాచుల్లో రాణించాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతను.. ఆ తర్వాత మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్‌ను ఏలుతూనే ఉన్నాడు.

శ్రీలంకపై అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ.. తన మొదటి మ్యాచులో పెద్దగా రాణించలేదు. కేవలం 12 పరుగులే ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే అతని ఆటతీరును గమనించిన అందరూ కూడా.. కోహ్లీకి చాలా ఫ్యూచర్ ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు.

Virat Kohli made his international debut on this day

ఇలా తన కెరీర్‌ను చాలా నెమ్మదిగా ఆరంభించిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. ఈ పదిహేనేళ్లలో ఎవరూ అందుకోలేని అంత ఎత్తుకు ఎదిగాడు. తన తొలి మ్యాచ్‌లో పెద్దగా రాణించని కోహ్లీ.. తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత జట్టు 143 పరుగులు ఛేజింగ్‌ చేస్తుండగా 37 పరుగులు చేశాడు.

బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉన్న పిచ్‌పై మిగతా బ్యాటర్లు తేలిపోయినా.. కోహ్లీ మాత్రం చాలా పట్టుదలగా ఆడాడు. ఆ తర్వాత టీమిండియా ఛేజింగ్‌లో ఎప్పుడు కష్టంలో ఉన్నా తనే ముందుండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలోనే 'ఛేజ్ మాస్టర్' పేరు సంపాదించాడు.

ఇక ఇటీవల తన అంతర్జాతీయ కెరీర్‌లో 500వ మ్యాచ్ ఆడిన కోహ్లీ.. ఇప్పటికీ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో అద్భుతమైన శతకం సాధించాడు. తద్వారా 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ బాదిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. మరెన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో కోహ్లీ అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కోహ్లీ కెరీర్ ఆరంభ రోజులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అలాగే కోహ్లీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ సాధించి పెట్టిన ఇన్నింగ్సుల వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు.

Story first published: Friday, August 18, 2023, 11:31 [IST]
Other articles published on Aug 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+