Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాలీవుడ్ సినిమాల్లోకి విరాట్ కోహ్లీ: ట్విట్టర్‌లో ఫస్ట్ లుక్ పోస్టర్

Virat Kohli Shares Poster And Announces Another Debut After 10 Years
Virat Kohli to debut in a movie? Twitter post leaves fans confused

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ బాలీవుడ్ సినిమాలో నటించాడా? అంటే అతడు తాజాగా చేసిన ట్వీట్ అవుననే సమాధానికి తావిస్తోంది. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌ టోర్నమెంట్‌కు దూరమైన విరాట్ కోహ్లీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

శుక్రవారం విరాట్ కోహ్లీ తన ట్విట్టర్‌లో ఏదో మూవీ పోస్టర్‌లాగా ఉన్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలో కోహ్లీ ఓ సూపర్ హీరోలా కనిపిస్తున్నాడు. అంతేకాదు ఆ పోస్టర్‌పై "Trailer: The Movie" అని రాసి ఉంది. కోహ్లీ ఈ ఫోటోను తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ "పదేళ్ల తర్వాత మరో అరంగేట్రం చేస్తున్నాను.. వెయిట్ చేయలేకపోతున్నా" అని కామెంట్ చేశాడు.

ఈ ఫోటోలో కోహ్లీ Wrogn దుస్తులు ధరించి ఉన్నాడు. ఇప్పుడీ ఫొటో ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇది కోహ్లీ కొత్త ప్రాజెక్టు‌గా తెలుస్తోంది. అయితే ఇది పూర్తి సినిమానా లేక షార్ట్ ఫిల్మా లేక బ్రాండ్ ప్రమోషన్ కోసం ఇలా చేశాడా అనేది మాత్రం తెలియరాలేదు.

అయితే, కోహ్లీ నిజంగానే సినిమాల్లోకి వస్తే అభిమానులకు పండుగే. ఇటీవలే బాలీవుడ్ నటి, తన భార్య అనుష్క శర్మతో కలిసి మాన్యవర్ యాడ్‌లోనూ కోహ్లీ నటించిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, September 21, 2018, 13:39 [IST]
Other articles published on Sep 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+