Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐరాతో డ్యాన్స్ చేసిన కెప్టెన్ కోహ్లీ (వీడియో)

హైదరాబాద్: ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌ను 3-0తో కోహ్లీసేన కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్ విజయంతో భారత ఆటగాళ్లు సంతోషంలో ఉన్నారు. ఈ సందర్భంగా భారత పేసర్ మహమ్మద్‌ షమీ సోషల్‌మీడియా ద్వారా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

ఈ వీడియోలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. మహమ్మద్ షమీ ముద్దుల కుమార్తె ఐరాతో కలిసి డ్యాన్స్‌ చేశాడు. సిరీస్‌ని 3-0తో కైవసం చేసుకున్న తర్వాత చోటు చేసుకున్న సన్నివేశమని షమీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరిస్‌లో ఆరు ఇన్నింగ్సుల్లో కలిపి షమీ 10 వికెట్లు తీశాడు.

Virat Kohli Dancing With Mohammed Shami's Daughter Is Cuteness Overload

ఇక ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే ఆగస్టు 31న జరగనుంది. దీంతో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో జట్టులో మార్పులు చేయనున్నట్టు కోహ్లీ చెప్పాడు. తొలి మూడు వన్డేల్లో ఒకే జట్టుతో భారత్‌ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

దాంతో మిగిలిన మ్యాచ్‌ల్లో మనీష్‌ పాండే సహా రిజర్వ్‌ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు లభించనుంది. 'మాది 15 మంది సభ్యుల బృందం. సిరీస్‌ గెలిచినందున మిగిలిన క్రికెటర్లకూ అవకాశాలు ఇవ్వాలనుకుంటు న్నాం' అని మూడో వన్డే అనంతరం విరాట్‌ కోహ్లీ తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+