Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: 'ఊ అంటావా మావ' పాటకు ఊర మాస్ స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ!

Virat Kohli Dancing For OO Antava Song From Pushpa Movie At Glenn Maxwell Wedding Party

ఆర్సీబీ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్, విని రామన్ వివాహం జరిగి బుధవారం నాటికి ఒక నెల పూర్తి అయిన సందర్భంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ బయోబబుల్‌లో ఈ జంట కోసం ప్రత్యేక వేడుకను నిర్వహించింది. చాలా మంది ఆర్సీబీ ప్లేయర్‌లు తమ సోషల్ మీడియా ద్వారా ఈ ఫంక్షన్‌లో పాల్గొన్న చిత్రాలను షేర్ చేశారు. భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి పార్టీని ఆస్వాదించారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత డ్యాన్స్ చేసి 'ఊ అంటావా మావ' పాటకు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టెప్పులేశాడు. కోహ్లీ డ్యాన్స్ నెట్టింట వైరలవుతోంది.

పెళ్లి కారణంగా లేటుగా ఆర్సీబీ బయోబబుల్‌లోకి

మాక్స్‌వెల్ తన చిరకాల స్నేహితురాలు అయిన విని రామన్‌‌ను ఈ ఏడాది మార్చి 27న పెళ్లి చేసుకున్నాడు. విని రామన్ భారతీయ సంతతికి చెందిన అమ్మాయి కావడంతో భారతీయ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. పెళ్లి కారణంగా మాక్స్‌వెల్ ఆర్సీబీ బయో‌బబుల్‌లోకి కొంచెం ఆలస్యంగా చేరాడు. ఆర్సీబీ ఆడిన తొలి మ్యాచ్‌లకు కూడా మిస్సయ్యాడు.

బయోబబుల్‌లో కూడా ప్రతి ఫంక్షన్ జరుపుకోవచ్చు

బయోబబుల్‌లో జరిగిన ప్రత్యేక వేడుకలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, వనిందు హసరంగా తదితర విదేశీ ఆటగాళ్ల తమ సోషల్ మీడియా ద్వారా తమ ఫోటోలు షేర్ చేశారు. వారు సంప్రదాయ దుస్తులు ధరించి ఫోటోలు దిగారు. బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి దిగిన ఒక చిత్రాన్ని షేర్ చేసింది. బయో‌బబుల్‌లో వివాహ వేడుకలో పాల్గొనడం తొలిసారి అనే క్యాప్షన్ ఇచ్చింది. బయోబబుల్లో కూడా ప్రతి ఫంక్షన్‌ను జరుపుకునే వీలుంటుందని ఈ వేడుక ద్వారా తెలుసుకున్నా అని అనుష్క పేర్కొంది.

మొదట్లో బానే గెలిచారు.. మళ్లీ పరాజయాల బాట

ఈ ఐపీఎల్లో ఆర్సీబీ కొత్త సారథి ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలో బరిలోకి దిగింది. తమ మొదటి 7మ్యాచ్‌లలో ఆర్సీబీ ఐదింటిని గెలిచి అద్భుతంగా ప్రారంభించింది. అయినప్పటికీ ఆర్సీబీ గత రెండు మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలు మూటగట్టుకుని తన టచ్ కోల్పోయినట్లు కన్పిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 68పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయి అప్రతిష్ట పాలయింది.

ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిందే

ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిందే

గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కూడా దారుణంగా ఆర్సీబీ ఓడిపోయింది. చెత్త బ్యాటింగ్‌తో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది. 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది.

రియాన్ పరాగ్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం ఆర్‌సీబీ 19.3 ఓవర్లలో 115 పరుగులకు కుప్పకూలింది. ఫాఫ్ డుప్లెసిస్(23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 145పరుగులను కూడా ఛేదించలేక ఆర్సీబీ బ్యాటర్లు చేతులెత్తేయడం ఆందోళనకరం.

ఇక ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. మళ్లీ తమ ఫామ్ అందిపుచ్చుకోవాల్సిన అవసరముంది. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫామ్ తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. కోహ్లీ త్వరలోనే అతని టచ్ అందుకుని చెలరేగుతాడని జట్టు భావిస్తోంది.

Story first published: Thursday, April 28, 2022, 12:24 [IST]
Other articles published on Apr 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+