Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై విందు: ధావన్ తనయుడు జోరావర్‌తో కోహ్లీ డ్యాన్స్ (వీడియో)

Virat Kohli dances with Shikhar Dhawan's son Zoravar at Mumbai reception. Watch video

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల ముంబై రిసెప్షన్ మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబై లోయర్ పర్ల్‌లోని రెజీస్ ఆస్టర్ బాల్‌రూమ్‌లో జరిగిన ఈ వివాహ విందుకు అటు బాలీవుడ్‌, ఇటు క్రికెట్‌ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి హాజరైన భారత జట్టులోని క్రికెటర్లంతా ప్రత్యేక సూట్‌లతో దర్శనమిచ్చారు. మంగళవారం రాత్రి 8.30 గంటలకు మొదలైన ఈ వివాహ విందు వేడేకు, అర్ధరాత్రి దాటేవరకు కొనసాగింది. ఈ వేడుకలో బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్ కొత్త పెళ్లి జంటతో కలిసి డ్యాన్స్ చేశాడు.

ఇక విరాట్ కోహ్లీ సైతం యువీ, హర్భజన్‌లతో కలిసి పంజాబీ నృత్యంతో అలరించాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ వివాహ విందులో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కుమారుడు జోరావర్‌ని ఎత్తుకుని కోహ్లీ డ్యాన్స్ చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాలో శిఖర్ ధావన్ సభ్యుడిగా ఉన్నాడు. వీరిద్దరి మధ్య మంచి స్నేహభావం ఉంది. ఇటీవలే ఢిల్లీలో మొదటి విందుకి కూడా శిఖర్ ధావన్ హాజరై డ్యాన్స్ చేసి అలరించాడు.

అనుష్క బంగారు వర్ణంతో తయారు చేసిన లెహంగా ధరించగా, తెల్లని కుర్తాపై డాప్లర్ బ్లూ బ్లేజర్‌ను విరాట్ కోహ్లీ ధరించాడు. తాజాగా ముంబైలో జరిగిన వివాహ విందుకు కూడా శిఖర్ ధావన్ తన కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. ఇదిలా ఉంటే విరుష్క జోడీ ముంబై రిసెప్షన్‌కు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి హాజరయ్యాడు.

ఇక, సునీల్‌ గవాస్కర్‌, అనిల్‌ కుంబ్లే, మాజీ కెప్టెన్‌ ధోని, రోహిత్‌ శర్మ సతీ సమేతంగా హాజరు కాగా... జడేజా, పుజారా, కుల్దీప్, మనీష్ పాండే, చాహల్, అశ్విన్, ఉనాద్కట్, బుమ్రా, ఉమేశ్ కూడా కార్యక్రమానికి విచ్చేశారు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

బాలీవుడ్ నుంచి అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య, షారుక్‌ ఖాన్‌, ఏఆర్‌ రెహమాన్‌, శ్రీదేవి, రేఖ, మాధురీ దీక్షిత్‌, షారూఖ్, రణ్‌బీర్ కపూర్, అభిషేక్, ఐశ్వర్య, కత్రినా కైఫ్‌, కంగనా రనౌత్‌, లారా దత్తా, మహేష్‌ భూపతి, నీతా అంబానీ, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు.

పాత విభేదాలను పక్కనబెడుతూ భారత మాజీ కోచ్ అనిల్ కుంబ్లే సతీసమేతంగా ఈ వివాహ విందుకు హాజరవడం క్రికెట్ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. డిసెంబరు 11న ఇటలీలోని టస్కనీలో కుటుంబ సభ్యుల మధ్య విరాట్‌ కోహ్లీ, అనుష్క పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 27, 2017, 11:40 [IST]
Other articles published on Dec 27, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+