అదిరింది: బౌండరీ లైన్ వద్ద కోహ్లీ డ్యాన్స్ (వీడియో)
ముంబై: ఐసీసీ వరల్డ్ టీ20లో భాగంగా ముంబైలోని వాంఖడె మైదానంలో వెస్టిండిస్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టెస్ట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. వీడియోలో విరాట్ కోహ్లీ మ్యాచ్‌లో భాగంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు.
కోహ్లీని చూస్తూ గ్యాలరీలోని అభిమానులు బాలీవుడ్ పాటకు చిందులేయడంతో కోహ్లీ కూడా అభిమానులను చూసి ఫీల్డింగ్ చేస్తుండగానే డ్యాన్స్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 192 పరుగులు చేయగా, 2 బంతులు మిగిలి ఉండగానే విండిస్ లక్ష్యాన్ని చేధించింది.
చివరి మూడు ఓవర్లలో మ్యాచ్‌ని వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్ వారికి అనుకూలంగా మరల్చుకున్నారు. వెస్టీండీస్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 89 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేయడాన్ని చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications