Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విజ్డన్ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్లకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ

Virat Kohli, Dale Steyn named in Wisden cricketers of the decade list


హైదరాబాద్:
విజ్డన్ ప్రకటించిన దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మరో భారత క్రికెటర్‌కు మాత్రమే చోటు దక్కింది. గత పదేళ్లలో విరాట్ కోహ్లీ మొత్తం 5775 పరుగులు చేశాడు. దీంతో విడ్జన్ ప్రకటించిన వన్డే జట్టుకు విరాట్ కోహ్లీనే కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

ఈ మేరకు విజ్డన్ తన ప్రకటనలో "అతను మేధావి. ఎప్పటికప్పుడు ఎదిగిన తీరు సవాళ్లను ఎదుర్కొన్న వైనం. 2014లో ఇంగ్లాండ్ పర్యటన ముగిసినప్పటి నుంచి నవంబర్‌లో కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మధ్య కాలంలో కోహ్లీ 63 యావరేజితో 21 సెంచరీలతో పాటు 13 హాఫ్ సెంచరీలు సాధించాడు" అని పేర్కొంది.

కోహ్లీని ఓ ప్రత్యేకమైన ఆటగాడిగా

కోహ్లీని ఓ ప్రత్యేకమైన ఆటగాడిగా

"ఈ గణాంకాలే కోహ్లీని ఓ ప్రత్యేకమైన ఆటగాడిగా మిగిల్చాయి. మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో కనీసం 50 సగటున ఉన్న ఏకైక బ్యాట్స్‌మన్. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత ధోని ప్రభ క్రమంగా క్షీణించినప్పటి నుంచి ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా కోహ్లీ లాగా ఒత్తిడిలో పనిచేయలేదు" అని విజ్డన్ పేర్కొంది.

27 సెంచరీలతో సహా

27 సెంచరీలతో సహా

గత దశాబ్దంలో విరాట్ కోహ్లీ 27 సెంచరీలతో సహా టెస్టుల్లో 7,202 పరుగులు చేశాడు. ఇక, వన్డేల్లో 11,125 పరుగులు, టీ20ల్లో 2,633 పరుగులు చేశాడు. విజ్డన్ ప్రకటించిన జట్టులో టీమిండియా నుంచి కోహ్లీతో పాటు రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కింది.

విజ్డన్ ప్రకటించిన టెస్టు జట్టు

విజ్డన్ ప్రకటించిన టెస్టు జట్టు

అలెస్టర్ కుక్ (ఇంగ్లాండ్) డేవిడ్ వార్నర్( ఆస్ట్రేలియా), కుమార సంగక్కర్ల( శ్రీలంక), స్టీవ్ స్మిత్ ( ఆస్ట్రేలియా), విరాట్ కోహ్లీ( భారత్), బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), ఏబీ డెవిలియర్స్( దక్షిణాఫ్రికా), రవిచంద్రన్ అశ్విన్( భారత్), డేల్ స్టెయిన్( దక్షిణాఫ్రికా), కగిసో రబాడ( దక్షిణాఫ్రికా), జేమ్స్ ఆండర్సన్( ఇంగ్లాండ్)

Story first published: Thursday, December 26, 2019, 13:04 [IST]
Other articles published on Dec 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+