
హైదరాబాద్: భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పరాజయం ఎదుర్కొన్న ఇంగ్లాండ్.. రెండో మ్యాచ్‌లో కోహ్లీసేనకు ధీటైన సమాధానం చెప్పింది. కార్డిఫ్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి టీమిండియా జోరుకు బ్రేక్ వేసింది. మొదటి టీ20లో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ను అర్థం చేసుకోలేక ఇబ్బంది పడ్డ ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్.. ఈ మ్యాచ్‌లో మాత్రం అతనిని సులభంగా ఎదుర్కొన్నారు. అతను వేసిన తొలి ఓవర్‌లో కాస్త ఇబ్బంది పడినా.. మిగతా మూడు ఓవర్లలో ధాటిగానే పరుగులు రాబట్టారు.
'మొదట్లోనే మూడు కీలక వికెట్లు కోల్పోవడం మమల్ని దెబ్బతీసింది. ఇంగ్లాండ్ బౌలర్లు కూడా సరైన ప్రాంతాల్లో బంతులు విసిరి మేము చెత్త షాట్లను ఎంచుకునేలా చేశారు. మేము అదనంగా మరో 10-15పరుగులు చేయాల్సింది. 149పరుగులు కూడా పోరాడే స్కోరే. కానీ, మేము పోరాడిన విజయం వాళ్ల సొంతమైందంటూ' కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో కుల్‌దీప్ యాదవ్ వికెట్ లేకుండానే 34పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ హేల్స్(58నాటౌట్; 41బంతుల్లో 4×4, 3×6) ఇన్నింగ్స్ చివరి వరకూ నిలిచి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ పట్ల నిరాశ వ్యక్తం చేశాడు. ఆరంభంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో స్కోరుబోర్డుపై తక్కువ పరుగులకే పరిమితం కావాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
మరోవైపు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ కుల్దీప్‌యాదవ్‌ను ఎదుర్కొన్న విధానాన్ని కూడా కోహ్లీ అభినందించాడు. 'ఈ రోజు మ్యాచ్‌లో వాళ్లు కుల్‌దీప్‌ను చక్కగా ఎదుర్కొన్నారు. అదే మిడిల్ ఓవర్లలో సరైన ఫలితాన్నిచ్చింది. అంతకుముందు నెట్స్‌లో కూడా వాళ్లు దీనికోసం ఎంతగానో శ్రమించారంటూ' కోహ్లీ తెలిపాడు.