Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. అత్యంత వేగంగా.. అతి తక్కువగా!

Virat Kohli crosses 11000 mark in one day International

ప్రపంచ క్రికెట్ కప్ 2019లో భాగంగా భారత, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును అందుకొన్నాడు. భారత వన్డే క్రికెట్‌లో 11 వేల పరుగులు చేసిన తొమ్మిదో ఆటగాడిగా ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో 57వ పరుగు పూర్తి చేయగానే కోహ్లీ 11 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు.

1
43665

గతంలో మాస్టర్ బ్లాస్టర్ 276 ఇన్నింగ్స్‌లో 11 వేల మార్కును అందుకొన్నాడు. అయితే కెప్టెన్ కోహ్లీ 221 ఇన్నింగ్స్‌లోనే 11 వేల మైలురాయిని అధిగమించడం విశేషం. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో, అతి వేగంగా ఈ రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం.

2008 ఆగస్టు 18న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వన్డే క్రికెట్‌లోకి ప్రవేశించాడు. ఇప్పటి వరకు భారత జట్టు తరుఫున 229 మ్యాచ్‌ల ఆడిన కోహ్లీకి 221 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. 37 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. మొత్తం 41 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలను తన ఖాతాలో వేసుకొన్నాడు. వన్డేలో కోహ్లీ అత్యధిక స్కోరు 183 పరుగులు కావడం గమనార్హం. సరికొత్త రికార్డు తనపేరిట లిఖించుకోనున్నాడు.

{headtohead_cricket_5_3}

కడపటి వార్తలు అందేసరికి భారత జట్టు 47 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 305 పరుగులు చేసింది. కోహ్లీ 71 పరుగులతో క్రీజులో ఉన్నాడు. శంకర్ 3 పరుగులు చేసి అవుటయ్యాడు.

Story first published: Sunday, June 16, 2019, 18:24 [IST]
Other articles published on Jun 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+