కెమెరా క్లిక్: జహీర్ నిశ్చితార్థ ఫంక్షన్‌లో మెరిసిన కోహ్లీ-అనుష్క
హైదరాబాద్: బాలీవుడ్ నటి సాగరికతో టీమిండియా మాజీ ఆటగాడు, ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టన్ జహీర్ ఖాన్ ఎంగేజ్‌మెంట్ మంగళవారం ఘనంగా జరిగింది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు క్రికెటర్లు సైతం హాజరయ్యారు.
సాగరికతో నిశ్చితార్థం జరిగినట్లు ఇటీవల జహీర్‌ఖాన్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ పదో సీజన్ మధ్యలో సాగరికను గోవా తీసుకెళ్లి పెళ్లిచేసుకుంటావా అని జహీర్ అడగటం, ఆమె వెంటనే ఒప్పుకోవడంతో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు.
ఆ తర్వాత వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్న ఫోటోలను జహీర్ ఖాన్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాడు. కాగా, ఐపీఎల్ బీజీ షెఢ్యూల్ కారణంగా జహీర్ ఖాన్ ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించలేకపోయాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత జహీర్ తన ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌ను మంగళవారం సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, తన ప్రేయసి బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి హాజరయ్యారు. దీంతో వీరిద్దరి జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని ఎంతో హుందాగా ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ ఇద్దరితో పాటు జహీక్ ఖాన్ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమానికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, భార్య అంజలి, రోహిత్ శర్మ భార్య రితికా, యువరాజ్ సింగ్, మందిరా బేడీ, బాబీ డియోల్, రహానే, మహ్మద్ కైఫ్, పార్ధీవ్ పటేల్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సాగరికతో జహీర్ ఖాన్
బాలీవుడ్ నటి సాగరికతో టీమిండియా మాజీ ఆటగాడు, ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టన్ జహీర్ ఖాన్ ఎంగేజ్‌మెంట్ మంగళవారం ఘనంగా జరిగింది.

జహీర్ ఖాన్ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమానికి వస్తున్న కోహ్లీ-అనుష్క
ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు క్రికెటర్లు సైతం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి, తన ప్రేయసి అనుష్క శర్మతో కలిసి కోహ్లీ హాజరయ్యాడు.

కెమెరాకు కోహ్లీ-అనుష్క ఫోజోలు
ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి, తన ప్రేయసి అనుష్క శర్మతో కలిసి కోహ్లీ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఫోటోలకు ఫోజులిస్తున్న దృశ్యం.

భార్య రితికాతో రోహిత్ శర్మ
తన భార్య రితికాతో కలిసి జహీర్ ఖాన్ ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.

భార్య అంజలితో సచిన్
తన భార్య అంజలితో కలిసి జహీర్ ఖాన్ ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన క్రికెట్ లెజెంజ్ సచిన్ టెండూల్కర్.

ధావల్ కులకర్ణి
తన భార్యతో కలిసి జహీర్ ఖాన్ ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన క్రికెటర్ ధావల్ కులకర్ణి.

యువరాజ్ సింగ్
బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి జహీర్ ఖాన్ ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన వెటరన్ ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్.

ఆశిష్ నెహ్రా
తన భార్యతో కలిసి జహీర్ ఖాన్ ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా.

అజయ్ జడేజా
తన భార్య అతిథితో కలిసి జహీర్ ఖాన్ ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన టీమిండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా.

మహ్మద్ కైఫ్, పార్దీవ్ పటేల్
జహీర్ ఖాన్ ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్. మహ్మద్ కైఫ్ పక్కనే వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ పార్ధీవ్ పటేల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications