Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాళ్లే నన్ను కెప్టెన్‌ను చేశారు: అలిసి పోయానని ట్విట్టర్‌లో ఫోటో

హైదరాబాద్: తనకు కెప్టెన్‌గా పేరొచ్చిందంటే అది జట్టు సభ్యుల వల్లేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ సేన 208 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. టెస్టు మ్యాచ్ గెలిచిన అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

19 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించడం ద్వారా మీలో మెరుగుదల కనిపించిందా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కోహ్లి స్పందించాడు. నిజాయితీగా చెప్పాలంటే ఈ ఘనత అంతా జట్టులో ఉన్న ఆటగాళ్లదే, వాళ్లే తనను కెప్టెన్‌ని చేశారని, తనకు కెప్టెన్‌గా పేరొచ్చిందంటే అది జట్టు సభ్యుల వల్లేనని కోహ్లీ అన్నాడు.

ఫీల్డర్లందరూ బౌలర్లకు మద్దతుగా ఉండాలి

ఫీల్డర్లందరూ బౌలర్లకు మద్దతుగా ఉండాలి

మైదానంలో ఫీల్డింగ్‌ను ఎలా సెట్‌ చేయాలో ఏ క్రికెటర్‌కైనా తెలుసు. జట్టులో ఎల్లప్పుడూ ఉత్సాహం నింపేలా కృషి చేయాల్సిన అవసరం కెప్టెన్‌కు ఉందని కోహ్లీ చెప్పాడు. మైదానంలో ఉన్న ఫీల్డర్లందరూ బౌలర్లకు మద్దతుగా ఉండాలి. వాళ్ల ఫీల్డింగ్‌పై బౌలర్లు వికెట్‌ తీసే ఆధారపడి ఉంటుందని కోహ్లీ చెప్పాడు.

దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నా

దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నా

అందువల్ల వాళ్లలో ఉత్సాహన్ని నింపే పనిని తాను తీసుకుంటానని అన్నాడు. దీంతో కెప్టెన్‌ దూరంగా ఉన్నప్పటికీ మైదానంలో ఆటగాళ్లు వారంతటవారే మంచి ఫీల్డింగ్‌ చేసేందుకు ఆసక్తి కనబరుస్తారని కోహ్లీ పేర్కొన్నాడు. తాను దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తానని, తద్వారా జట్టులోని ఇతర సభ్యులు కూడా దాన్ని అనుసరిస్తారని చెప్పాడు.

బంగ్లాపై విజయం బౌలర్లకే చెందుతుంది

బంగ్లాపై విజయం బౌలర్లకే చెందుతుంది

బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు విజయం భారత బౌలర్లకే చెందుతుందని, పిచ్‌ కొంచెం సహనానికి పరీక్ష పెట్టినప్పటికీ మంచి ప్రదర్శన చేశారని కోహ్లీ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో 204 పరుగులు చేసిన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కోహ్లీకి కెప్టెన్‌గా ఇది వరుసగా 19వ టెస్ట్ మ్యాచ్ విజయం కావడం విశేషం.

ఉప్పల్ స్టేడియం స్టాఫ్‌తో ముచ్చటించిన కోహ్లీ

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ స్టేడియం స్టాఫ్‌తో కలిసి ముచ్చటించాడు. వారితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. దీంతో పాటు బంగ్లాదేశ్ యువ క్రికెటర్లతో కొంత సమయం గడిపి, క్రికెట్‌కు సంబంధించిన పలు సూచనలు చేశాడు.

అలిసి పోయానని ట్విట్టర్‌లో ట్వీట్

బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు విజయానంతరం తిరిగి తన నివాసానికి బయల్దేరే ముందు హైదరాబాద్ విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్నప్పుడు తన సెల్ఫీను తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తాను అలిసి పోయానని, ప్రస్తుతం విమాన ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నాననే పోస్టుని కోహ్లీ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+