హెచ్చరిక: 'క్లైవ్ లాయిండ్ రికార్డుని కోహ్లీ అధిగమిస్తాడు'
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. ఉప్పల్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 208 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వరుసగా ఆరు టెస్టులు గెలుచుకోవడంతో పాటు కెప్టెన్‌గా కూడా కోహ్లీ పలు రికార్డులు సృష్టించాడు. టెస్టుల్లో టీమిండియాకు 15వ విజయాన్ని అందించిన మూడవ కెప్టెన్‌గా కోహ్లి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కోహ్లీ నాయకత్వంపై సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల సిరిస్‌లో కోహ్లీ సేన విజయం సాధించి వరుసగా 19 విజయాలను సొంతం చేసుకున్న జట్టుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

క్లైవ్ లాయిడ్ టెస్టు రికార్డుని కోహ్లీ అధిగమిస్తాడు
మంగళవారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో గవాస్కర్ మాట్లాడుతూ వెస్టిండిస్ లెజెండర్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ టెస్టు రికార్డుని విరాట్ కోహ్లీ అధిగమిస్తాడని పేర్కొన్నాడు. క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్టిండిస్ జట్టుకు వరుసగా 27 టెస్టు విజయాలను సొంతం చేసుకుంది.

27 టెస్టు విజయాలు
1982 నుంచి 1984 మధ్య కాలంలో వెస్టిండిస్ జట్టుకు నాయకత్వం వహించిన క్లైవ్ లాయిడ్ వరుసగా 27 టెస్టు విజయాలను అందుకున్నాడు. ఇందులో ఒక మ్యాచ్‌కి సర్ వివ్ రిచర్డ్స్ స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. బంగ్లాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ సేన 208 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

వరుసగా ఆరో టెస్టు సిరీస్
ఈ విజయంతో వరుసగా ఆరో టెస్టు సిరీస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా ఆరో టెస్టు సిరీస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాపై 3-0, వెస్టిండిస్‌పై 2-0 (బయట), న్యూజింలాండ్‌పై 3-0, ఇంగ్లండ్‌పై 4-0 తేడాతో భారత్ సిరీస్‌లు దక్కించుకుంది.

కోహ్లీ సేనకు గవాస్కర్ హెచ్చరిక
ఇక ఫిబ్రవరి 23 నుంచి ఆస్ట్రేలియాతో ఆరంభం కానున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కోహ్లీ సేన జాగ్రత్తగా ఉండాలని సునీల్ గవాస్కర్ హెచ్చరించాడు. ఆస్ట్రేలియాతో సిరిస్ భారత్‌కు కేక్ వాక్ లాంటిది కాదన్నాడు. పోరాడకుండా ఆస్ట్రేలియా తన ఓటమిని అంగీకరించదని పేర్కొన్నాడు.

టెస్టు ర్యాంకుల్లో టీమిండియా నెంబర్ వన్
ఇదిలా ఉంటే ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా జట్టు రెండో స్ధానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా చివరిసారిగా 2013లో భారత పర్యటనకు వచ్చి 4-0తో వైట్‌వాష్‌కు గురైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications