Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డేల్లో కోహ్లీనే నెంబర్ వన్: టాప్-10లో కనిపించని బౌలర్లు

హైదరాబాద్: శుక్రవారం ఐసీసీ వన్డే ర్యాంకులను ప్రకటించింది. తాజా ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. 873 పాయింట్లతో కోహ్లీ అగ్రస్ధానంలో కొనసాగుతుండగా, అత‌ని కంటే 12 పాయింట్ల త‌క్కువ ఉన్న డేవిడ్ వార్న‌ర్ రెండ‌వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఐదు వన్డేల సిరిస్‌‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే ఆగస్టు 20 (ఆదివారం) ప్రారంభం కానుంది. ఈ సిరిస్‌తో కోహ్లీ తన లీడ్‌ను పెంచుకునేందుకు అవకాశం వచ్చింది. టాప్-15 బ్యాట్స్‌మెన్ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ(12), ధావ‌న్‌(13), రోహిత్‌(15) ఉన్నారు.

Virat Kohli continues to top ICC ODI rankings for batsmen

ఇక, టాప్‌-10 బౌలింగ్ జాబితాలో మాత్రం ఒక్క భారత్ బౌలర్ కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. భారత్ పేసర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఒక్క‌డే 13వ స్థానంలో నిలిచాడు. ఇక జట్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్ర‌స్తుతం మూడ‌ో స్ధానంలో కొనసాగుతోంది. శ్రీలంక‌తో జరగనున్న వన్డే సిరిస్‌ను 4-1 తేడాతో కోహ్లీసేన విజయం సాధిస్తే ఇంగ్లండ్‌ను అధిగమిస్తుంది.

ఇదిలా ఉంటే తాజా ర్యాంకులతో శ్రీలంకకు గట్టి దెబ్బ తగలనుంది. 2019 ప్రపంచ కప్‌నకు నేరుగా అర్హత సాధించాలంటే భారత్‌పై కనీసం రెండు వన్డేలైనా గెలవాలి. మెగా టోర్నీ అర్హతకు చివరి తేదీ సెప్టెంబర్‌ 30. ప్రస్తుతం 88 పాయింట్లతో లంక 8వ స్థానంలో ఉంది.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ప్రకారం చివరి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌లో ఆడేందుకు గాను అర్హత టోర్నీలో తలపడాల్సి ఉంటుంది. శ్రీలంకకు తొమ్మిదో స్థానంలోని విండీస్‌ (78 పాయింట్లు)తో ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+