Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనుష్కతో పెళ్లి: ఆ తర్వాత కోహ్లీ క్రికెట్ ఆడతాడా..?

 Will Virat Kohli continue to play cricket now that he's married

హైదరాబాద్: వివాహబంధంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ డిసెంబర్ 11న ఒక్కటైన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువుల సమక్షంలో ఇటలీకి దగ్గర్లోని టస్కనీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

పెళ్లి అనంతరం అనుష్క శర్మ తన వృత్తిని కొనసాగిస్తుందా? లేదా? అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదిలింది. ఇది ట్విట్టర్లో వైరల్ కావడంతో ఈ విషయమై వర్థమాన గాయని శ్వేతా పండిట్ స్పందించింది.

'పెళ్లి తర్వాత విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడతాడా?' అన్న ప్రశ్న ఇప్పుడు వైరల్ అయింది. 'ఆన్‌లైన్‌లో ఓ ఫ్రెండ్ ద్వారా నాకు ఈ ప్రశ్న వచ్చింది. ఇలాంటి ప్రశ్నలు అనుష్క గురించి మాత్రమేనా.. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇలాంటి తెలివి తక్కువ ప్రశ్నలు కేవలం మహిళలను మాత్రమే ఎందుకు అడుగుతారు' అని శ్వేత ట్వీట్ చేసింది.

శ్వేతా పండిట్ ట్విట్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆమె ట్వీట్‌పై కొందరు అభినందిస్తుంటే మరికొందరు ఇదేం ప్రశ్న అంటూ విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్న వీరిద్దరూ డిసెంబర్ 21న ఢిల్లీలో.. డిసెంబర్ 26న ముంబైలో అటు క్రికెట్... ఇటు బాలీవుడ్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు రిసెప్షన్ ఇవ్వనున్నారు.

ఇప్పటికే రిసెప్షన్‌కు సంబంధించిన ఇన్విటేషన్లు పలువురు ప్రముఖులకు వెళ్లాయి. ఈ ఇన్విటేషన్‌ను విరాట్ కోహ్లీ తన అభిరుచికి తగ్గట్లుగా సింపుల్‌గా కాకుండా.. ఓ గిఫ్ట్ బాక్స్‌లాగా అతిథులకు అందజేశాడు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ తనకు అందిన ఇన్విటేషన్ కార్డును ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

పెళ్లి కోసం శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌ నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్‌ శర్మకు అప్పగించిన సంగతి తెలిసిందే. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో వన్డేల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 14, 2017, 20:41 [IST]
Other articles published on Dec 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+