
హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 48 బంతుల్లో విరాట్ కోహ్లీ హాఫ్‌సెంచరీ సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 52వ హాఫ్ సెంచరీ. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు సాధించిన రెండో కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అంతకముందు టోర్నీలో భాగంగా సఫారీలతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 82, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 1992లో జరిగిన ప్రపంచకప్‌లో అప్పటి కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో కోహ్లీ 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నబీ బౌలింగ్‌లో రెహ్మాత్ షాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఆప్ఘనిస్థాన్ విజయ లక్ష్యం 225
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు సరైన ఆరంభం లభించలేదు. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద రోహిత్ శర్మ(1) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, వీరిద్దరూ 57 పరుగులు సాధించిన తర్వాత రాహుల్ అనవసరపు షాట్‌కు యత్నించి రెండో వికెట్‌గా ఔటయ్యాడు.
ఈ క్రమంలో కోహ్లీ-విజయ్ శంకర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది ప్రయత్నం చేసింది. వీరిద్దరూ 58 పరుగుల జత చేసిన తర్వాత విజయ్ శంకర్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో జట్టు స్కోరు 122 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం జట్టు స్కోరు 135 వద్ద కోహ్లీ అనూహ్యంగా ఔటయ్యాడు.
మహ్మద్ నబీ వేసిన బంతిని కట్ షాట్ చేయబోగా.. బంతి టాప్ ఎడ్జ్ తీసుకొని థర్డ్ మ్యాన్ రహ్మత్ షా చేతిలో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని, కేదార్ జాదవ్‌లు ఆప్ఘన్ బౌలర్లను ప్రతిఘటించడంతో భారత్ తేరుకుంది. వీరిద్దరూ 57 పరుగులు జత చేసిన తర్వాత ధోని ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే హార్దిక్ పాండ్యా(7) కూడా పెవిలియన్ చేరాడు.
అనంతరం షమీ(1) కూడా పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో కేదార్ జాదవ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని చివరి ఓవర్ ఐదో బంతికి ఔటయ్యాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. పిచ్ బౌలర్లకు ఎక్కువగా సహకరించడంతో పరుగులు చేయడానికి భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆప్ఘన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్, నబీ చెరో రెండు వికెట్లు తీయగా... జద్రాన్, ఆలం, రషీద్ ఖాన్, రహ్మత్ షా తలో వికెట్ తీశారు.