ఫోటోలు: ముంబైలో రికార్డు సృష్టించిన కోహ్లీ
హైదరాబాద్: టీమిండియా టెస్టు కెప్టెన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో కెప్టెన్ కోహ్లీ ఒక కేలండర్ ఇయర్‌లో 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
దీంతో 2016లో విరాట్ కోహ్లీ టెస్టుల్లో 1000 పరుగులు సాధించినట్లైంది. గతంలో ఈ రికార్డుని టీమిండియా కెప్టెన్లుగా ఇద్దరు మాత్రమే సాధించారు. 1997లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, 2006లో రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఘనత అందుకున్న కెప్టెన్లుగా ఉన్నారు.

1000 పరుగుల వీరుడు కోహ్లీ
విరాట్ కోహ్లీ సాధించిన 1000 పరుగుల్లో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 11 ఇన్నింగ్స్‌ల్లో 17వ ఇన్నింగ్స్ ఆడుతున్న కెప్టెన్ కోహ్లీ ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇక ఈ కేలండర్ ఇయర్‌లో 1000 పరుగులు సాధించి కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 211 కావడం విశేషం.

మొదటి స్ధానంలో సచిన్ టెండూల్కర్
ఇక ఒకే ఏడాదిలో టెస్టుల్లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మొదటి స్ధానంలో ఉన్నాడు. 2010లో సచిన్ టెండూల్కర్ 1562 పరుగులను చేశాడు. ఆ తర్వాతి స్ధానంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆటగాడిగా రెండో స్థానంలో ఉన్నాడు.

టెస్టుల్లో 4000 పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీ
2010లో సెహ్వాగ్ 1422 పరుగులు నమోదు చేశాడు. మరోవైపు ముంబై టెస్టులో కోహ్లీ 4000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో 4000 పరుగుల మైలురాయిని అందుకున్న 14వ బ్యాట్స్ మెన్‌గా కోహ్లీ గుర్తింపు పొందాడు. 2011లో టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తర్వాత టెస్టుల్లో 1000 పరుగులు చేసిన భారత్ ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ గుర్తింపు పొందాడు.

ఒకే ఒక్క భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ
ఈ కేలండర్ ఇయర్‌లో 1000 పరుగులు మైలురాయిని దాటిన ఒకే ఒక్క భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మాత్రమే. 820 పరుగులతో కోహ్లీ తర్వాత భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఛటేశ్వర్ పుజారా నిలిచాడు. ఈ ఏడాది టెస్టుల్లో 1000 పరుగులకు పైగా సాధించిన ఆటగాళ్లలో బెయిర్ స్టో (1,369), జో రూట్ (1,306), అలెస్టర్ కుక్ (1,193)లు ఉన్నారు.

కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు
ఇదిలా ఉంటే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా విశాఖలో జరిగిన రెండో టెస్టులో కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ టెస్టులో 248 పరుగులు చేసిన కోహ్లీ ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. విశాఖ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులు చేసిన కోహ్లి, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications