న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కలలో కూడా ఊహించలేదు: 11 ఏళ్ల క్రికెట్ కెరీర్‌పై కోహ్లీ భావోద్వేగ ట్వీట్

Virat Kohli Completes 11 Years In International Cricket || Oneindia Telugu
Virat Kohli completes 11 years in international cricket, thanks God for showering His blessing

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 11 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టాడు. 2008లో యువకుడిగా భారత జట్టులో అడుగుపెట్టిన తాను.. 11 ఏళ్ల ప్రయాణంలో ఇంత సాధిస్తానని కలలో కూడా ఊహించలేదని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.

దంబుల్లా వేదికగా 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డేతో అరంగేట్రం చేశాడు. ఆ వన్డేలో గౌతమ్ గంభీర్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తన మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. నువాన్ కులశేఖర బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

<strong>టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ఎవరో తెలుసా?</strong>టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ఎవరో తెలుసా?

కోహ్లీ మొదటి మ్యాచ్‌లో

కోహ్లీ మొదటి మ్యాచ్ అభిమానుకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్‌లో "2008లో యువకుడిగా భారత జట్టులో అడుగుపెట్టిన తాను.. 11 ఏళ్ల ప్రయాణంలో ఇంత సాధిస్తానని కలలో కూడా ఊహించలేదు. దేవుడి ఆశీస్సుల వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగా. సరైన మార్గంలో తమ కలలను సాకారం చేసుకోవాలని, అందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలను సొంతం చేసుకోవాలి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా" అని కోహ్లీ ట్వీట్ చేశాడు.

మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా

మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా

మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ... ఒక దశాబ్ద కాలంలో 20వేల పైచిలుకు పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. భారత్ తరుపున ఇప్పటవరకు 239 వన్డేలు, 77 టెస్టులు, 70 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 68సెంచరీలు చేశాడు. అందులో వన్డేల్లో43, టెస్టుల్లో 25 సెంచరీలున్నాయి.

'బాహుబలి' సిద్ధార్థ్ వీరవిహారం.. తెలుగు టైటాన్స్ విజయం

సచిన్ తర్వాత కోహ్లీనే

సచిన్ తర్వాత కోహ్లీనే

ఇక, భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ(11,520) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(18,426) పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇంకా ఎన్ని సెంచరీలు సాధిస్తాడో!

ఇంకా ఎన్ని సెంచరీలు సాధిస్తాడో!

ఇటీవలే ముగిసిన మూడు వన్డే సిరిస్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదడంతో వన్డేల్లో సచిన్‌(49) తర్వాత అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో కోహ్లీ(43) నిలిచాడు. మరో ఏడు సెంచరీలు సాధిస్తే సచిన్ టెండూల్కర్ రికార్డు సైతం బద్దలవుతుంది. 30 ఏళ్ల కోహ్లీలో ఇంకా ఆట మిగిలుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో కోహ్లీ ఇంకా ఎన్ని సెంచరీలు సాధిస్తాడో చూడాలి.

Story first published: Monday, August 19, 2019, 12:50 [IST]
Other articles published on Aug 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X