
అన్ని ఫార్మట్లలోనూ..
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఒక్క భారీ ఇన్నింగ్ కూడా ఆడలేకపోయాడు. టీ20 సిరీస్‌లోనూ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. ఇప్పుడిక ఆసియా కప్ సిరీస్ కోసం సన్నద్ధమౌతోన్నాడు విరాట్ కోహ్లీ. ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల 28వ తేదీన పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడబోతోంది భారత్. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టీ విరాట్ కోహ్లీ మీదే ఉంది. ఒక్క భారీ ఇన్నింగ్ ఆడితే చాలు- విమర్శలన్నింటికీ చెక్ పెట్టినట్టవుతుంది.

1000 రోజులు పూర్తి..
కోహ్లీ కేరీర్‌లో ఇప్పటివరకు 70 సెంచరీలు ఉన్నాయి. ఇందులో 43 వన్డే ఇంటర్నేషనల్స్‌లో చేసినవి. మిగిలిన 23 టెస్ట్ ఫార్మట్‌లో అందుకున్నవి. చివరి సెంచరీ 2019లో నమోదు చేశాడు. ఆ ఏడాది నవంబర్ 23వ తేదీన బంగ్లాదేశ్‌పై కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండో రోజు కోహ్లీ సెంచరీ సాధించాడు. ఇక అంతే. అప్పటి నుంచి సెంచరీ కోసం ఎదురు చూస్తోనే ఉన్నాడు. చివరి సెంచరీ చేసి 1000 రోజులయింది. క్రికెట్ ఆడుతోన్న ఓ ప్రొఫెషనల్ ప్లేయర్ ఒక్క సెంచరీ కోసం ఇన్ని రోజులుగా ఎదురు చూడటం ఇదే తొలిసారి.

విశ్రాంతి తరువాత..
ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అంచనాలను అందుకోలేకపోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌కు ఎంపిక కాలేదు. జింబాబ్వే సిరీస్‌కూ దూరంగానే ఉన్నాడు. విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడిక విరాట్ కోహ్లీ క్రీజ్‌లోకి దిగబోయేది ఆసియా కప్ టోర్నమెంట్‌లోనే. సెంచరీ చెయ్యకుండా 1000 రోజులను పూర్తి చేసుకోవడం అనేది ఏ ప్రొఫెషనల్ క్రికెటర్ గానీ, అతని అభిమానులు గానీ కోరుకోనిది. అలాంటి రోజొకటి వస్తుందని ఊహించివుండరు.

4,114 రోజుల్లో..
తన కేరీర్‌లో 4,114 రోజుల్లో విరాట్ కోహ్లీ 70 సెంచరీలు అందుకున్నాడు. 71వ సెంచరీ కోసం 1000 రోజులుగా ఎదురు చూస్తోన్నాడు. 1000 రోజులుగా ఏ ఫార్మట్‌లో కూడా సెంచరీ చేయని వరల్డ్ క్లాస్ బ్యాటర్‌గా చరిత్రకు ఎక్కాలని ఎవరూ కోరుకోరు. ఆసియా కప్‌లోనైనా విరాట్ కోహ్లీ తన పరుగుల కరవును తీర్చుకుంటాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్ ఆడాలని అభిమానులు కోరుకుంటోన్నారు.


Click it and Unblock the Notifications
