For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'జట్టును అప్పుడే వదిలి వెళ్లాలి' - రిటైర్మెంట్‌పై కోహ్లీ కామెంట్స్!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయం తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చాడు. భారత్ జట్టు ఎంత బలంగా ఉంది?, అసలు బలంగా ఎలా తయారైంది?, యువ ఆటగాళ్లలో ఎవరు బాగా రాణిస్తున్నారు? వంటి విషయాలు గురించి తన అభిప్రాయాన్ని తెలిపాడు.

అందుకే బలమైన జట్టుగా ఉన్నాం..
మ్యాచ్‌ అనంతరం విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ.. "ముందుగా మేం ఆస్ట్రేలియా పర్యటన తర్వాత పుంజుకోవాలని డిసైడ్ అయ్యాం. ఏదైనా పెద్ద టోర్నీలో గెలిచి మేమేంటో నిరూపించాలనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ విజయం సాధించడం అమేజింగ్ గా ఉంది. యంగ్ స్టర్స్ తో కలిసి ఆడటం చాలా బాగుంది. వాళ్లతో అద్భుతమైన టాలెంట్ ఉంది. వారు భారత క్రికెట్ ను సరైన దిశలోనే ముందుకు తీసుకెళుతున్నారు. మేము మీకు మా అనుభవాలను పంచుకుని, అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభావం చూపడం సంతోషంగా ఉంది. వాళ్లు కూడా తమదైన శైలిలో అద్భుతంగా ఆడుతున్నారు. అందుకే మేం బలమైన జట్టుగా ఉంటున్నాం."

Virat Kohli Comments on Retirement hint After India won Champions Trophy 2025

అద్బుతంగా అనిపిస్తోంది...
"టైటిల్ కోసం ఆడేటప్పుడు, ఒత్తిడిలో ఆడేటప్పుడు ఎంతో ఆస్వాదిస్తాం. మొత్తం జట్టు తమ వంతుగా ప్రభావవంతమైన ప్రదర్శన చేసింది. అటగాళ్లు అద్భుతంగా రాణించారు. గెలవడం కోసం ప్రాక్టీస్‌ సెషన్‌లో, మైదానంలో జట్టుగా ఉండటం అద్భుతంగా అనిపిస్తోంది. ఈ అద్భుతమైన జట్టులో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది."

రిటైర్మెంట్ హింట్.. వచ్చే 10 ఏళ్ల పాటు రెడీ...
"మనం జట్టు నుంచి వెళ్లాలనుకున్నప్పుడూ, జట్టును ఉత్తమ స్థానంలో ఉంచి మనం వీడాలి. వచ్చే 8-10 ఏళ్ల పాటు ప్రపంచాన్ని ఎదుర్కోనేందుకు మా జట్టు బలంగా, సిద్ధంగా ఉంది. శుభ్‌మన్‌ గిల్ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ కూడా కొన్ని సార్లు అసాధారణమైన ప్రదర్శన చేశాడు. కేఎల్‌ రాహుల్‌ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు.

హార్దిక్‌ బ్యాట్ తో అద్భుతం చేస్తున్నాడు. న్యూజిలాండ్‌ కూడా గొప్ప జట్టు. గత కొత్త కాలంగా ఆ జట్టు పరిమిత టాలెంట్ ఆటగాళ్లతోనే రాణించడం చూసి మేం ఆశ్చర్యపోతున్నాం. ప్రణాళికలను అద్భుతంగా అమలు చేస్తూ బరిలోకి దిగుతారు. ఫీల్డింగ్ యూనిట్ చాలా బాగుంది. నా మంచి మిత్రుడు కేన్‌ విలియమ్సన్‌ ఓడిపోవడం చూసి చాలా బాధగా ఉంది. ఏదేమైనా వారు తమ ప్రణాళికలను అద్భుతంగా రాణిస్తున్నారు. అందుకే వారు మంచి పోటినిస్తున్నారు." అని కోహ్లీ అన్నాడు.

Story first published: Monday, March 10, 2025, 9:40 [IST]
Other articles published on Mar 10, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+