Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్ చేతిలో 5-0తో భారత్ ఓడితే!: నెం.1 ర్యాంక్ పరిస్థితి ఏంటీ!

Ravi Shastri Speaks On Down Tour Game Controversy
Virat Kohli and co to remain on top of ICC Test rankings even if they lose 5-0 to England

హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1 నుంచి కోహ్లీసేన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా ఈ టెస్టు సిరిస్‌ను 0-5తో చేజార్చుకున్న భారత ర్యాంకింగ్‌లో ఎటువంటి మార్పు ఉండదు.

ఎందుకంటే భారత్ ఖాతాలో ప్రస్తుతం 125 పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా (106) పాయింట్లతో ఆ తర్వాత వరుసగా ఆస్ట్రేలియా (106), న్యూజిలాండ్ (102), ఇంగ్లాండ్ (97)తో ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగే సిరిస్‌లో కోహ్లీసేన క్లీన్‌స్వీప్‌కు గురైతే 13 పాయింట్లను చేజార్చుకుంటుంది.

 ఇంగ్లాండ్‌తో సిరిస్ ముగిసే సమయానికి

ఇంగ్లాండ్‌తో సిరిస్ ముగిసే సమయానికి

దీంతో ఇంగ్లాండ్‌తో సిరిస్ ముగిసే సమయానికి భారత్ ఖాతాలో 112 పాయింట్లు ఉంటాయి. ఇలా జరిగినప్పటికీ... టాప్-5లోని ఏ జట్టూ భారత్‌ను ర్యాంకింగ్స్‌లో అధిగమించలేదు. అంతేకాదు ప్రస్తుతం లంక పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా టెస్టు సిరిస్‌ను 2-0తో వైట్‌వాష్‌కు గురవ్వడం కూడా భారత్‌కు కలిసొచ్చింది. ఇదిలా ఉంటే ఇంగ్లీషు గడ్డపై గత ఏడేళ్లలో రెండు సార్లు పర్యటించిన భారత్ పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది.

 అప్పట్లో అగ్రస్థానాన్ని చేజార్చుకున్న టీమిండియా

అప్పట్లో అగ్రస్థానాన్ని చేజార్చుకున్న టీమిండియా

ముఖ్యంగా 2011లో నంబర్ వన్ ర్యాంక్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలై అప్పట్లో అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. ఆ తర్వాత 2014లో మరోసారి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి ఐదు టెస్టుల సిరీస్‌ని 1-3తో చేజార్చుకుంది. ఇక, ఇటీవల ముగిసిన పరిమిత ఓవర్ల సిరిస్‌లో కూడా టీమిండియాకు మిశ్రమ ఫలితాలే వచ్చాయి. టీ20 సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకున్న కోహ్లీసేన వన్డే సిరీస్‌ను మాత్రం 1-2తో చేజార్చుకుంది.

టెస్టు సిరిస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోహ్లీసేన

టెస్టు సిరిస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోహ్లీసేన

దీంతో టెస్టు సిరిస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా సరే టెస్టు సిరిస్‌ను గెలవాలనే పట్టుదలతో ఇంగ్లీషు గడ్డపై తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమం‍లో కెప్టెన్‌‌గా మరో ఆరుదైన ఘనతను సొంతం చేసుకునే అవకాశం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి లభించింది. ఆగస్టు 1 నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఆరంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా గెలిస్తే మాజీ కెప్టెన్లు అజిత్‌ వాడేకర్‌, కపిల్‌దేవ్‌, రాహుల్‌ ద్రవిడ్‌‌ల సరసన విరాట్ కోహ్లీ చేరనున్నాడు.

 మూడు సార్లు మాత్రమే టెస్టు సిరిస్‌ను నెగ్గిన భారత్

మూడు సార్లు మాత్రమే టెస్టు సిరిస్‌ను నెగ్గిన భారత్

ఇప్పటివరకు ఇంగ్లాండ్‌ గడ్డపై టీమిండియా కేవలం మూడు సార్లు మాత్రమే టెస్టు సిరిస్‌ను నెగ్గింది. వాడేకర్‌, కపిల్‌దేవ్‌, ద్రవిడ్‌ సారథ్యంలోనే ఇది సాధ్యమైంది. టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలనందించిన మాజీ కెప్టెన్లు సౌరవ్‌ గంగూలీ, ధోనిలు ఇంగ్లీషు గడ్డపై మాత్రం టెస్టు సిరిస్‌ను గెలవలేకపోయారు. అయితే, వారిద్దరికీ సాధ్యం కానిది ఇప్పుడు కోహ్లీ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.

Story first published: Wednesday, July 25, 2018, 18:44 [IST]
Other articles published on Jul 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+