Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND Vs NZ: సచిన్‌కు ఎసరుపెట్టిన కోహ్లీ! - న్యూజిలాండ్ మ్యాచ్‌‌లో ఆ రికార్డులపై కన్ను!!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం (మార్చి 2) టీమిండియా - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే విరాట్ కోహ్లీ.. పాకిస్థాన్ పై సెంచరీ బాది ఫామ్ లో వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడు కివీస్ తో జరిగే మ్యాచ్ లో.. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ సాధించిన పలు రికార్డులను బ్రేక్ చేసే అవకాశం వచ్చింది. అవేంటంటే?

300వ వన్డే మ్యాచ్..
కోహ్లీ న్యూజిలాండ్ తో జరగబోయే మ్యాచ్ 300వ వన్డే. ఇప్పటి వరకు 299 వన్డే మ్యాచులు 287 ఇన్నింగ్స్ ఆడాడు. 58.21 యావరేజ్ తో, 9.42 స్ట్రైక్ రేట్ తో 14,085 పరుగులు చేశాడు. అందులో 51 సెంచరీలు, 73 అర్ధ శతకాలు ఉన్నాయి.

Virat Kohli closer to sachin tendulkar records against Newzealand in champions trophy 2025

మరో 106 పరుగులు చేస్తే..
వన్డేల్లో న్యూజిలాండ్ పై అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ఆటగాడిగా నిలుస్తాడు కోహ్లీ. ప్రస్తుతం సచిన్ తెందూల్కర్ కివీస్ పై 1750 పరుగులతో భారత్ తరఫున అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ పై అతడు 42 వన్డేల్లో ఐదు శతకాలు, ఎనిమిది అర్ధ శతకాలు బాదాడు. కోహ్లీ.. 31 వన్డేల్లో 6 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో 1645 రన్స్ సాధించాడు. కాబట్టి మరో 106 పరుగులు విరాట్ చేస్తే సచిన్ రికార్డ్ బ్రేక్ అవుతుంది. మొత్తంగా రికీ పాంటింగ్ 1971 పరుగులు, 51 మ్యాచ్‌లతో అగ్ర స్థానంలో ఉన్నాడు.

3 వేల పరుగులు..
న్యూజిలాండ్ మ్యాచ్‌లో మరో 85 పరుగులు సాధిస్తే న్యూజిలాండ్‌పై 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదో బ్యాటర్ గా నిలుస్తాడు కోహ్లీ. టీమిండియా తరఫున సచిన్ తెందుల్కర్ (3,345) ఒక్కడే ఈ మార్క్ ను అందుకున్నాడు. ఓవరాల్ గా ఈ జాబితాలో రికీ పాంటింగ్ (3,145) టాప్ లో ఉన్నాడు. న్యూజిలాండ్‌పై ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 55 మ్యాచ్‌లు ఆడాడు కోహ్లీ. 47.01 యావరేజ్ తో 2,915 పరుగులు సాధించాడు. ఇందులో తొమ్మిది శతకాలు, 15 అర్ధ శతకాలు ఉన్నాయి.

కాగా, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ ఏ నుంచి ఇప్పటికే న్యూజిలాండ్ - ఆసీస్ జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. తాజా మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టే గ్రూప్-ఎలో అగ్రస్థానాన్ని దక్కించుకుంటుంది.

Story first published: Saturday, March 1, 2025, 11:06 [IST]
Other articles published on Mar 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+