Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వీడియో వైరల్: రషీద్ మ్యాజిక్ బంతికి కోహ్లీ క్లీన్ బౌల్డ్

Virat Kohli clean bowled by a leg-spinner for the first time

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాకు షాక్ తగిలింది. మంగళవారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో పర్యాటక జట్టు టీమిండియాపై 8 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్ విజయం సాధించి మూడు వన్డేల సిరిస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(71: 72 బంతుల్లో 8ఫోర్లు) అనూహ్యంగా ఔటయ్యాడు. అయితే, కోహ్లీ ఔటైన బంతిని చూసి షాక్‌కు గురయ్యాడు. ఈ విషయాన్ని మ్యాచ్‌ అనంతరం విరాట్ కోహ్లీనే స్వయంగా వెల్లడించడం విశేషం. లీడ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టాస్ ఓడి భారత్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది.

ఈ క్రమంలో ఓ వైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ దశలో ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ స్పెల్‌ టీమిండియాను దెబ్బ తీసింది. ముందుగా కార్తీక్‌ను బౌల్డ్‌ చేసిన రషీద్‌ ఆ తర్వాత ఇన్నింగ్స్‌ 31వ ఓవర్లో కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు.

31వ ఓవర్ తొలి బంతిని విరాట్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి ఎక్కువ‌గా టర్న్ కావడంతో అదికాస్త బ్యాట్‌ను తాకకుండా నేరుగా వెళ్లి ఆఫ్‌స్టంప్ వికెట్‌ను తాకింది. క్షణాల వ్యవధిలో ఊహించని షాక్ తగలడంతో ఆశ్చర్యానికి గురైన విరాట్ కోహ్లీ కొద్దిసేపు క్రీజులోనే ఉండి పిచ్‌ను, బౌలర్‌ను చూస్తూ షాక్‌లో నిలిచిపోయాడు.

అదే ఓవర్‌ చివరి బంతికి రైనా (1) కూడా ఔట్‌ కావడంతో భారత్‌ కష్టాలు పెరిగాయి. రోహిత్ శర్మ ఔటైన తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ ఇంగ్లీష్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని పరుగులు సాధించాడు. దీంతో టీమిండియా మూడో వన్డేలో
స్కోర్‌కే పరిమితమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Wednesday, July 18, 2018, 11:49 [IST]
Other articles published on Jul 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+