మాకేమో ఔట్ ఇచ్చారు.. ఇప్పుడేమో నాటౌటా?- అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం(Video)
అడిలైడ్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డే/నైట్ టెస్టులో థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదస్పదంగా మారింది. మిచెల్ మార్ష్ ఔట్‌గా నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవంటూ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతేగాక ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఇలాంటి సందర్భంలోనే పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్‌ను ఔట్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు నాటౌట్ ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించాడు.
టీ విరామానికి ముందు ఆఖరి రెండో ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 58వ ఓవర్ మూడో బంతిని ముందుకు వచ్చి డిఫెండ్‌కు ప్రయత్నించాడు. అయితే ప్యాడ్లకు తాకడంతో టీమిండియా ఔట్ అని అపీల్ చేసింది. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో.. విశ్వాసంతో భారత్ సమీక్షకు వెళ్లింది. అయితే మార్ష్ డిఫెన్స్ చేసిన బంతి బ్యాటు కంటే ముందు ప్యాడ్‌కు తాకింది. తొలుత ప్యాడ్లకే తాకిందని స్పష్టంగా కనిపించింది.

కానీ బాల్ ట్రాకింగ్ ప్రొటోకాల్ పాటించకుండా థర్డ్ అంపైర్.. స్నికో రీడింగ్ ఆధారంగా మిచెల్ మార్ష్ నాటౌట్ అని తేల్చాడు. 'మొదట బ్యాటుకు లేదా ప్యాడ్‌కు తాకిందా అనడానికి సరైన ఆధారాలు లేవు' అని థర్డ్ అంపైర్ పేర్కొంటూ తొలుత ప్రకటించిన నాటౌట్‌కే కట్టుబడి ఉండాలని ఫీల్డ్ అంపైర్‌కు సూచించాడు. అయితే పెర్త్ టెస్టులో ఇలాంటి సందర్భంలో కేఎల్ రాహుల్‌కు, ఫీల్డ్ అంపైర్లకు వ్యతిరేకంగా థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రాహుల్ ఔట్ అంటూ తొలి టెస్టులో ఆసీస్ అపీల్ చేసింది. బ్యాటుకు తాకలేదని ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా సమీక్షకు వెళ్లింది. రివ్యూలో బ్యాట్‌ను బంతి తాకినట్లు స్పష్టత లేదు. మరోవైపు ప్యాడ్‌ను బ్యాట్ తాకడంతో స్పైక్స్ వచ్చాయని స్పష్టంగా తెలిసింది. కానీ, సరైన ఆధారం లేకపోయినా రాహుల్ ఔట్ అంటూ థర్డ్ అంపైర్ ప్రకటించాడు. దీనిని ఉదాహరణగా తెలుపుతూ ఫీల్డ్ అంపైర్లతో అడిలైడ్ టెస్టులో కోహ్లి వాదించాడు.
''పెర్త్‌లో కేఎల్ రాహుల్‌ది కూడా ఇదే పరిస్థితి. బ్యాటు-ప్యాడ్‌కు మధ్య వెళ్లింది. కానీ ఔట్ ఇచ్చారు'' అంటూ అంపైర్‌తో కోహ్లి పేర్కొన్నాడు. అయితే కాసేపటికే అశ్విన్ బౌలింగ్‌లో ఫీల్డ్ అంపైర్ తప్పిదంతో మార్ష్ ఔటయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో డిఫెన్స్‌కు మిచెల్ మార్ష్ (9; 26 బంతుల్లో) ప్రయత్నించగా బంతి వికెట్ కీపర్ పంత్ చేతుల్లోకి వెళ్లింది. ఎడ్జ్ తీసుకుందని భావించి మార్ష్ వెనుదిరగడంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు. మరో ఎండ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్ రివ్యూకి వెళ్లమని చెప్పకపోవడం గమనార్హం.
Third umpire says no conclusive evidence to overturn the decision on this ball.pic.twitter.com/VDaI5Ka7hD
— Tanuj Singh (@ImTanujSingh) December 7, 2024
Once a leader always a leader !
— Devendra 🇮🇳 (@Devendra786s) December 7, 2024
Virat Kohli always ready for his team ❤️🔥#AUSvsIND #AUSvIND #INDvsAUS #ViratKohlipic.twitter.com/tvzmbHQbYL https://t.co/yPd2TjjW1g
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications