భాంగ్రా డ్యాన్స్‌తో దుమ్మురేపిన కోహ్లీ, గేల్(వీడియో)
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ఫాంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఫైనల్ వరకు చేర్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో పరుగులతోనూ బయట తన నృత్యాలతోనూ అభిమానులకు అలరిస్తున్నాడు.
ప్లేఆఫ్‌లో కోహ్లీ విఫలమైనప్పటికీ ఏబి డివిలియర్స్ విధ్వసం సృష్టించడంతో గుజరాత్ లయన్స్‌ను చిత్తు చేసి నేరుగా ఫైనల్ చేరింది. దీంతో పట్టరాని సంతోషంతో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ... సహచరులు క్రిస్ గేల్, మన్‌దీప్ సింగ్‌తో కలిసి 'భాంగ్రా' స్టెప్పులతో దుమ్మురేపాడు.

మ్యాచ్ గెలిచిన వెంటనే పార్టీ చేసుకున్న జట్టు ఆటగాళ్లు ఆటపాటలతో చిందులేశారు. మన్‌దీప్ సింగ్ సూచనలతో కోహ్లీ, గేల్ 'భాంగ్రా' స్టెప్పులేశారు. ఇక చివర్లో మీసాలు మెలేసి తొడ గొట్టిన మన్‌దీప్ సింగ్... గేల్‌తోనూ విజయ దరహాసం చేయించాడు.
ఈ వీడియోను 'రాయల్స్' యాజమాన్యం తన వెబ్‌సైట్‌లో పెట్టేసింది. ఆ తర్వాత యూట్యూబ్‌లోకి చేరిపోయి హల్‌చల్ చేస్తోంది. కాగా, ఇప్పటికే ఈ వీడియోకు యూట్యూబ్‌లో లక్షకుపైగా హిట్లు వచ్చేశాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications