Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ టెస్ట్ ఎలెవెన్ కెప్టెన్ మన విరాట్ కోహ్లీ

హైదరాబాద్: క్రికెట్‌కు సంబంధించిన మూడు ఫార్మాట్లలోనూ అదరగొడుతున్న ప్రస్తుత భారత టెస్ట్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఎలెవన్ కెప్టెన్‌గా షేన్ వార్న్, మరో ఇద్దరు మాజీ క్రికెటర్లు కలిసి ఎంపిక చేశారు. స్కై స్పోర్ట్స్ కార్యక్రమంలో శనివారంనాడు ముగ్గురు మాజీ ఆటగాళ్లు ప్రపంచంలోని పదకొండు మంది ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేశారు.

వార్న్‌ో పాటు ఇంగ్లాండుకు చెందిన మైక్ ఆథర్జన్, పాకిస్తాన్‌కు చెందిన రమీజ్ రాజా కలిసి ప్రపంచ టెస్టు క్రికెట్ జట్టును ఎంపిక చేశారు. మోర్నే మోర్కెల్‌ను 12వ ఆటగాడిగా వారు ఎంపిక చేశారు. ఈ ముగ్గురు కలిసి 1990ల్లోని పదకొండు మంది ఉత్తమ క్రికెటర్లను కూడా ఎంపిక చేశారు.

Virat Kohli chosen as captain of 'Current World Test XI' by Shane Warne, others

ప్రస్తుత ఉత్తమ ఆటగాళ్లతో పాటు 1990ల నాటి ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేయాలని స్కై స్పోర్ట్స్ శనివారం ఉదయం తనతో పాటు ఆథర్స్, రమీజ్‌లను అడిగిందని, సెలెక్షన్ మీటింగ్‌లో ఏకాభిప్రాయానికి వచ్చామని వార్న్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ జట్టు సభ్యులను కూడా తెలిపారు.

దురదృష్టవశాత్తు ఆమ్లా, విలియమ్సన్ మిస్సయ్యారని ఆయన అన్నాడు. తుది 11 మంది సభ్యులను పరిస్థితులను బట్టి ఎంపిక చేసుకోవచ్చునని అన్నాడు. వారు ముగ్గురు టెస్టు జట్టుకు ఎంపిక చేసిన 11 మందిలో భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు. ఇంగ్లాండు జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్‌ను, ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్‌ను ఓపెనర్లుగా ఎంపిక చేశారు.

వార్న్, అథర్టన్, రాజాలు ఎంపిక చేసిన ప్రస్తుత ప్రపంచ టెస్ట్ జట్టు

1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
2. అలిస్టిర్ కుక్ (ఇంగ్లాండు)
3. జో రూట్ (ఇంగ్లాండు)
4. విరాట్ కోహ్లీ (ఇండియా, కెప్టెన్)
5. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
6. ఎబి డీ విల్లీర్స్ (దక్షిణాఫ్రికా, వికెట్ కీపర్)
7. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండు)
8. రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా)
9. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)
10. యాసిర్ షా (పాకిస్తాన్)
11. జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండు)
12. మోర్నె మోర్కెల్ (దక్షిణాఫ్రికా)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+