భువీ రిసెప్షన్ వేడుకలో సందడి చేసిన టీమిండియా క్రికెటర్లు (ఫోటోలు)

హైదరాబాద్: భారత క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. తన ప్రియురాలు నూపూర్ నగర్‌ను నవంబరు 23న పెళ్లాడాడు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు క్రికెట్ ప్రముఖులు విచ్చేయడంతో వేదికకు మరింత కళ వచ్చిపడింది.
వివాహ వేడుకకు విరాట్ కోహ్లీ తన ప్రియురాలు అనుష్కతో పాటు హాజరవ్వగా ఈ సారి ఒంటరిగా వచ్చాడు. ధావన్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా తమ భార్యలతో కలిసి హాజరయ్యారు. ధోనీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్, టీమిండియా జట్టు మేనేజ్‌మెంట్ సభ్యులు రిసెప్షన్‌లో పాల్గొన్నారు.
ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో దిల్లీలో చివరి టెస్టు ఆడుతుండటంతో అందరూ హాజరవడం సాధ్యపడింది. దీంతో మంగళవారం నాలుగో రోజు ఆట అనంతరం ఆటగాళ్లందరూ భువనేశ్వర్ రిసెప్షెన్‌కు హాజరై సందడి చేశారు. పెళ్లి సందర్భంగా శ్రీలంకతో జరుగుతోన్న ఈడెన్ టెస్ట్ అనంతరం భువనేశ్వర్ విరామం తీసుకోనున్నాడు. మళ్లీ డిసెంబరు 10 నుంచి భారత్-శ్రీలంక మధ్య ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు భువనేశ్వర్ అందుబాటులో ఉంటాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications